గత రెండు దశాబ్దాల నుండి భారత క్రికెట్ కి విశేష సేవలు అందించి, నేడే క్రికెట్ కి వీడ్కోలు పలికిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం అయిన ‘భారత రత్న ’ ను ప్రకటించింది. చాలా రోజుల క్రితం నుండే ఈయన కు భారత రత్న ఇవ్వాలని, అన్ని విధాల భారత రత్నకు అర్హుడని వాదిస్తూ వస్తున్నారు. కానీ కొందరు దీనిని విభేదిస్తూ వచ్చారు. ఈ సంవత్సరానికి భారత రత్న పురస్కారాల పేర్లలో క్రీడా శాఖ నుండి హాకీ క్రీడా కారుడు ధ్యాన్ చంద్ పేరును పంపగా, ఎటువంటి ప్రపోజల్ లేకుండానే ఈయనకు భారత రత్నను ప్రకటిస్తూ ఈ రోజు ( శనివారం) భారత రాష్ట్రపతి భవన్ కార్యాలయం ప్రకటించింది.
ఇక ఈయనతో పాటు సైన్స్‌లో విశేష సేవలు అందించిన ప్రధాని సాంకేతిక సలహాదారుడు సిఎన్ఆర్ రావుకు కూడా భారత రత్న ప్రకటించారు. కెరీర్‌కు వీడ్కోలు పలికిన మాస్టర్‌కు పురస్కారం ప్రకటించడం విశేషం. ఈ అవార్డు ప్రకటనతో క్రీడల్లో మొట్ట మొదటి భారత రత్న అవార్డును తీసుకున్న తొలి క్రీడాకారుణిగా కూడా సచిన్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఈ అవార్డుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడు కూడా మాస్టరే (40) కావడం విశేషం. భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించినందుకుగాను ఈ అవార్డును బహూకరించనున్నారు.
సచిన్ గౌరవార్థం ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా గతంలోనే ఎంపిక చేసింది. లెక్కకుమిక్కిలి రికార్డులు నెలకొల్పాడు. రెండు వందల టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా, అంతర్జాతీయ కెరీర్లో వంద సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా మాస్టర్ చరిత్ర పుటల్లోకి ఎక్కడమే కాకుండా సుధీర్ఘ క్రికెట్ ఇన్నింగ్స్ ఆడిన సచిన్ కి ఈ అవార్డు రావడం పట్ల సచిన్ అభిమానులనే కాకుండా అశేష్ భారతీయ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అవార్డు ప్రకటించిన అనంతం సచిన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఈ రిటైర్మెంట్ రోజు ‘భారత రత్న ’ అవార్డును ప్రకటించడం సంతోషంగా ఉన్నదని, నన్ను, నా ఆటను గుర్తించి ఈ అవార్డును ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు.ఈ అవార్డును తన తల్లికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించి మరోసారి తన గొప్ప వక్తిత్వాన్ని ప్రకటించుకున్నాడు. ఇక వీడ్కోలు అనంతరం చాలా భావోద్వేగాలకు లోనైన సచిన్ మాట్లాడుతూ...
నేను కెరియర్లో ఇంత స్థాయికి రావడానికి మా తల్లి, మా కుటుంబ సభ్యులే కారణం అని, నా భార్య అంజలి తన కోసం తన డాక్టర్ వ్రుత్తిని త్యాగం చేసిందని నా అఖండ విజయం వెనుక ఆమె ప్రోత్సాహం మరువలేనిదని, ఇక తన పిల్లలు సారా, సౌరవ్ లు తనకు దేవుడు ప్రసాదించిన వజ్రాల్లాంటి వారని ఇన్నిరోజులు బిజీ షెడ్యూలు కారణంగా వారితో సమయాన్ని కేటాయించలేదని, ఇక పై పూర్తి సమయాన్ని వారికే కేటాయిస్తానని హామి ఇచ్చాడు.
ఇక 24 సంవత్సరాలు నాతో ఆడిన ప్రతి ఒక్క క్రికెటర్ అందించిన సహాకారాలు మరవలేనివని కుంబ్లే, ద్రావిడ్, గంగూలీ, లక్ష్మణ్ తన క్రికెట్ కుటుంబమని చెప్పుకొచ్చాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడంలో ఎంతో త్రుప్తి చెందానని క్రికెట్ ఎప్పుడూ నా హ్రుదయంలోనే మిగిలి ఉంటుందని అన్నాడు. నా రిటైర్మెంటును అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నట్లు సచిన్ చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more