తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ రోజుకో మాట మాట్లాడుతుంది. సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని, ఎవరు అడ్డువచ్చినా పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేస్తామని ఇప్పటి వరకు ఢంకా బజాయిస్తూ చెప్పుకొస్తున్న కేంద్రం సీమాంధ్ర ప్రాంతం నుండి వ్యతిరేకత రావడం, వైయస్సార్ సీపీ పార్టీ పూర్తిగా సమైక్యాంద్రకు జై కొడుతుండం, రాయల సీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని సీమ నేతలు గొగ్గోలు పెడుతుండటంతో కేంద్ర ఒక్క అడుగు వెనక్కి వేసి కొత్తగా రాయల తెలంగాణ అంశం పై ద్రుష్టి సారించి నట్లు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు పది జిల్లాల తెలంగాణే అని ఊదరగొట్టి ఇప్పుడు ఫైనల్ గా రాయల తెలంగాణకు జై కొట్టిందని దీనికి సంబంధించిన ప్రక్రియ ఢిల్లీలో వేగవంతంగా జరుగుతుందని అంటున్నారు. ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలను నమ్మించిన హై కమాండ్ తాజాగా కేంద్రం కాని,కాంగ్రెస్ హై కమాండ్ కాని ఎందుకు రాయల తెలంగాణ వైపు ఎందుకు మొగ్గు చూపుతోందన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది
టి. ప్రజల్లో. పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో తలెత్తే సమస్యలన్నిటికీ రాయల ఏర్పాటే పరిష్కారమన్న నిర్ధారణకు అది వచ్చినట్టు సమాచారం. రాయల తెలంగాణ అయితే.. అసెంబ్లీలోనూ ముసాయిదా బిల్లుకు సానుకూల అభిప్రాయం వస్తుందని అంచనా వేస్తోంది. రాయల తెలంగాణ ఏర్పాటు చాలా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని, జల వివాదాలు, విద్యుత్తు వంటి చిక్కుముడులన్నింటికీ దీనితో చెక్ చెప్పవచ్చన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చింది.
కర్నూలు, అనంతపురం కరువు జిల్లాలు అయినందున తెలంగాణ ప్రాంతంలో సులువుగా ఇమిడి పోతాయని, అదే సమయంలో అసెంబ్లీ లో తీర్మానం సమయంలో విభజనకు వ్యతిరేకంగా వస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి రాయల తెలంగాణను ఏర్పాటు చేస్తే అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ ఘట్టాన్ని అధిగమించవచ్చని కాంగ్రెస్ హై కమాండ్ వ్యూహంగా రాయల తెలంగాణనే ఫైనల్ చేసినట్లు అంటున్నారు. ఈ విషయం పై కాంగ్రెస్ ప్రతినిది దిగ్విజయ్ సింగ్ పిసిసి మాజీ అద్యక్షుడు డి.శ్రీనివాస్ తో రాయల తెలంగాణ పై మంతనాలు కూడా జరిపారు.
నదీ జలాల అంశం సహా రాజకీయ లబ్ధిని ఆలోచించే రాయల తెలంగాణ దిశగా నిర్ణయం తీసుకుంటున్నామని దీనికి తెలంగాణ నేతలు సహకరించాలని కోరగా ఈ ప్రతిపాదనకు సుముఖంగా లేరని డి.శ్రీనివాస్ స్పష్టం చేశారని సమాచారం. ఇదే అంశం పై మాట్లాడటానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను ఢిల్లీకి పిలిపించి ఇదే విషయం చెప్పనున్నట్లు సమాచారం.
ఒకవేళ రెండు ప్రాంతాల నేతలు దీనికి అంగీకరించక పోతే మంత్రుల బృందం (జీవోఎం) తెలంగాణ, రాయల తెలంగాణ ప్రతిపాదనలు రెంటినీ కూడా కేంద్ర మంత్రివర్గం ముందు పెట్టి తేల్చుకోండని చెప్పే తాను సేఫ్ గా ఉండేందుకు రాయల తెలంగాణకే మొగ్గు చూపుతుందని అనుకోవచ్చు. మరి ఈ ప్రతిపాదనను తెలంగాణ నేతలు ఒప్పుకుంటారా ?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more