అసెంబ్లీలో రెండు ప్రాంతాలుగా విడిపోయి నాయకులు నానా రచ్చ రచ్చ చేస్తున్నారు. సీమాంద్ర నాయకులు జై సమైక్య ఆంద్ర అంటే తెలంగాణ నేతలు .. జై జై తెలంగాణ అంటూ అరుపులతో అసెంబ్లీ మ్రారుమ్రోగిపోతుంది. అంతేకాకుండా.. గాల్లోకి ఖాళీ కూర్చీలు పైకి లేవటం, నేతలు తోసుకోవటం , అంత ఒక యుద్దభూమిలా ఉంటుంది. కానీ ఈసన్నివేశాలను .. మీడియాలో పదే పదే చూపించటంతో.. అమాయక ప్రజలకు.. అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థంగాక నరాలు తెగిపోయే టెన్షన్ తో నలిగిపోతుంటాడు. ఒకనొక సమయంలో ఇరుప్రాంత నేతలు కొట్టుకుంటారు అనే విధంగా మన నాయకులు నటిస్తారు.
కానీ ఇదంత అసెంబ్లీలో ఉన్నంత సేపే అని సామన్య ప్రజలకు తెలియదు. మన నేతలు అసెంబ్లీ గడప దాటి వెంటనే ఎలా ఉంటారో అనేది అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. నిన్న అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ను కాల్చినేతలు, చించిన నాయకులు, వారిని అడ్డుకున్న తెలంగాణ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. ఇంకేముంది.. ఇరువురు కలబడి కొట్టుకుంటారని అందరు అనుకుంటారు. కానీ అలా ఎప్పటికి జరగదు. అసెంబ్లీలో వాడి వేడి వాదనలతో అరచిన నేతలకు కొద్ది సేపు విరామం దొరుకుంది. ఈ సమయంలో మన నేతలు ఎలా ఉంటారో మీరే చూడండి? ఈ పోటోలను చూస్తుంటే మీకేమనిపిస్తుంది.. ‘‘ చేసేది శివపూజ.. దూరేది.. సానీ గుడిసెలోకి ’’ అనే విధంగా మన నేతల తీరు ఉందని.
పైకి మాత్రం ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుల్లో కనిపిస్తారు.. చెట్టు చాటు దొరికితే చాలు.. పరామర్శలు, కౌగిలింతలు, షేక్ హ్యాండ్ లు, అవసరమైతో.. ఐ లవ్ యు కూడా చెప్పుకునే నాయకులు మన రాష్ట్రం లో ఉన్నారు. నిన్న వైసీపీ నేతలు వర్సెస్ టీఆర్ఎస్. ఈరోజు మాత్రం అలా కాదు.. దోస్త్ మేరా .. దోస్త్ అంటూ.. ఒకటే పలకరింపులు.. ? వీరిని చూసి … మీడియా కెమెరాలకే చీదరింపు పుడతుంది. ఇలాంటి నాయకుల ముఖాలను.. ప్రతి రోజు చూడాల్సి వస్తుందని .. మీడియా కెమెరాలు సిగ్గుతో చచ్చిపోతున్నాయి. (వాటికి ప్రాణం ఉంటే ఈ మాటలే చెప్పేవి) . ఇక మనం ఓటేసి గెలిపించినందుకు.. నిత్యం చస్తూ బతకాల్సిందే.. ఇది మన కర్మ అనుకోని ముందుకు పోవటమే .. మనిషి పని. ఓ సినీ కవి చెప్పినట్లు ‘‘ మారదు లోకం.. మారదు కాలం.. ’’ అన్నట్లు .. ఈ రాజకీయ నాయకులు మారరు .. మారరు. సిగ్గులేని జనం అంతకంటే మారరు మారరు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more