గురుతరమైన కావ్యరస గుంభనకబ్బురమంది ముష్కరుల్
సరసులమాడ్కి, సంతసిల జాలుదురోటు శశాంక చంద్రికాం
కురముల కిందు కాంతమణి కోటి స్రవించిన భంగా వింధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ !
టీకా : ముష్కరుల్ = మూఢులు ; గురుతరమైన = గొప్పదైన ; కావ్య-నకు = గ్రంథంలోనికి రసం కూర్పడం ; అబ్బురమంది = ఆశ్చర్యపడి ; సంతసిలన్ = సంతోషించగా ; జాలుదు రోటు = శక్తి కలిగి వుండి కూడా సంతోషించలేరు ; శశాంక - లకు = చంద్రుని వెన్నెల = ఇందు-కోటి = చంద్రకాంత శిలలు ; స్రవించిన భంగి = కరగి జారిపోయినట్లుగా ; వింధ్యమున = వింధ్యపర్వతంలో ; శిలలు = రాళ్లు ; జారునే = జారిపోవడం
తాత్పర్యము : మూఢులు ఎంతో గొప్పదైన గ్రంథములోని రసాన్ని కూర్పుకోవడానికి రసికులవలె సంతోషించరు. అదెలా అంటే.. చంద్రుని వెన్నెలలో వుండే చంద్రకాంత శిలలు కరిగి కారిపోయినట్లుగానే.. వింధ్యపర్వతంలో వున్న రాళ్లు కూడా పైనుండి కిందకు జారిపోతాయి కదా!
(And get your daily news straight to your inbox)
Nov 02 | మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదుర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నారసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధారసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసంతసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకోదండకళా ప్రచండ భుజ... Read more
Apr 15 | దారణపాత కాబ్ధికి స దా బడబాగ్ని భవాకులార్తి వి స్తారదవానలార్చికి సు ధారసవృష్టి దురంత దుర్మతా చారభయంక రాటవికిఁ జండకఠోరకుఠాధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : నీ తారకరామ =... Read more
Apr 14 | తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము ప విత్రముగాదె వియన్నదీజలం బరుగుచువంకయైన మలినా కృతిఁబాఱినఁ దన్మహత్త్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : తరణికులేశ = సూర్యవంశపు... Read more
Apr 11 | శ్రీ రఘువంశ తోయధికి సీత యమూఖుఁడనైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసి తోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ర్పసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : శ్రీ... Read more
Apr 08 | కనకవిశాలచేల భవ కానన శాతకుఠారధార స జ్జనపరిపాలశీల దివి జస్తుత సద్గుణకాండ కాండ సం జనిత రాక్రమక్రమ వి శారద శారదకుందకుంద చం దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా :... Read more