టీఆర్ఎస్-బీజేపి మద్య మరోసారి మాటల యుద్దం మొదలైంది. ఉప ఎన్నికలు ముగిసినా.., రెండు పార్టీల మద్య విమర్శల పర్వం మాత్రం ముగియటం లేదు. రెండు పక్షాలు సవాల్ళు.., ప్రతి సవాళ్ళతో రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. తాజాగా సెప్టెంబర్ 17 అంశంగా తెలంగాణ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పడక ముందు సెప్టెంబర్ 17ను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అధికారంలో ఉండి కార్యక్రమం ఊసెత్తటం లేదు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినంపై ప్రభుత్వం నోరు విప్పాలన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలను నిర్వహించిన గోల్కొండ కోటలో ప్రభుత్వం సెప్టెంబర్ 17న జాతీయ జెండాను ఎగురవేయలన్నారు. లేకపోతే తామే ఖిల్లాపై జెండా ఎగురవేసి సత్తా చాటుతామని సవాల్ చేశారు. కేవలం మజ్లిస్ ఒత్తడితో చరిత్రను కాలగర్భలో కలిపేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ‘‘తెలంగాణ సాయుధ పోరాటం’’లో పాల్గొన్నవారికి పెన్షన్లు ఆపేయటంపై మండిపడ్డారు. ఉద్యమకారులను ఇలాగే గౌరవిస్తారా? అని ప్రశ్నించారు. మా నిజాం రాజు తరతరాల బూజు అన్న దాశరథి మాటలను కేసీఆర్ ఖండిస్తారా? అని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more