మెదక్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ప్రత్యర్థ పార్టీల మధ్య రసవత్తరపోటీ సాగిన విషయం అందరికీ తెలిసిందే! ఈ నేపథ్యంలో అందరూ ఒకర్నొకరు బాగానే తిట్టేసుకున్నారు. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు విమర్శల మీద విమర్శలు గుప్పించేసుకున్నారు. జానారెడ్డి టీఆర్ఎస్ మీద ఒక ఎత్తు ఎగిరితే.. ఆ పార్టీ నుంచి ముగ్గురు, నలుగురు మంత్రులు ఒకేసారి ఈయనపై ఎత్తుకు పైఎత్తు సవాళ్లు విసురుకుంటూ ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఎన్నికలు వచ్చేశాయి. ఫలితాలు కూడా విడుదలయ్యాయి... చివరికి అనుకున్నట్లుగానే తెరాస విజృంభించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మెదక్ లో విజయకేతనాలు ఎగరవేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ భవన్ లోని మీడియాతో మాట్లాడిన ఆయన... మెదక్ పార్లమెంట్ స్థానంలో తెరాస గెలుపుకోసం కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇంకా మాట్లాడుతూ...
ప్రభుత్వం మీద ప్రజలు వుంచుకున్న విశ్వాసాన్ని పూర్తిగా నేరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.ఎన్నికల సందర్భంగా పొన్నాల సహా కొందరు చాలా అతిగా మాట్లాడారని.. ప్రభుత్వం అడుగు తీసి అడుగేస్తే దాన్ని తప్పు బట్టే ప్రచారం చేశారని అన్నారు.
తెదేపాతో జతకట్టినందుకు బీజేపీకి గట్టి దెబ్బే తగిలిందన్నారు. ప్రభుత్వంపై వారు చేసిన దుష్ర్పచారాన్ని ప్రజలు తిప్పికొట్టారన్నారు. ప్రతిపక్షాలు చేసే నిర్మాణాత్మకమైన విమర్శను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి, ఆచితూచి అడుగువేయాల్సి వుంటుందని... లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాల్సి వుంటుందని ఆయన గుర్తుచేశారు. తొందరపడి ఏ పనిచేసినా భవిష్యత్త తరాలు దెబ్బతింటాయని సూచించారు.
అర్హులకే ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందుతాయని పేర్కొన్న ఆయన... దసరా నుంచి దీపావళి మధ్య ఇంకా చాలా ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు చెప్పారు. కేసీఆర్, తెరాస మార్కు పరిపాలన ఇంకా ప్రారంభం కాలేదని... దాని ప్రభావమెంటో త్వరలోనే చూడబోతారని ఆయన ప్రత్యర్థ పార్టీలకు హెచ్చిరికలు జారీ చేసేలా చెప్పారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more