Telangana jagruthi kavita question by rayalaseema leaders

Kavita question by rayalaseema leaders, Telangana Jagruthi leader Kavita, rayala telangana, telangana bandu, rayalaseema leaders, tirupathi issue,

Telangana Jagruthi Kavita question by rayalaseema leaders

మీ పౌరుషం ఏమయ్యింది : కేసిఆర్ కూతురు

Posted: 12/05/2013 01:03 PM IST
Telangana jagruthi kavita question by rayalaseema leaders

రాయల తెలంగాణ ప్రతిపాదన తెరపైకి రావటంతో.. తెలంగాణ నేతలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణఱ జాగ్రుతి  సంఘాలు, రోడ్డుమీదకు వచ్చాయి.  తెలంగాణ  రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు  నేడు తెలంగాణ బంద్ కు పిలుపు నివ్వటంతో తెలంగాణ వాదులు బంద్ లో పాల్గొన్నారు.  అయితే  తెలగాణ నాయకుల మాత్రం  రాయల తెలంగాణనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సందట్లో సడేమియాలగా తెలంగాణ జాగ్రుతి అధ్యక్షరాలు, కేసిఆర్ కూతురు  కల్వకుంట్ల  కవిత రంగంలోకి దిగి, రాయలసీమ నాయకులను టార్గెట్ చేసింది. రాయలసీమ నాయకులరా  ఆ నాటి పౌరుషం  ఏమయ్యందని ప్రశ్నించింది.   

నిజాం కాలంలో  బళ్లారి, రాయచూర్  జిల్లాలతో  కలిపి  బ్రిటిష్ వారికి  ఇచ్చేశారు.అందుకే వాటిని దత్తత మండలాలు అని పిలిచేవారు. 1928లో ప్రత్యేకంగా సమావేశం పెట్టుకుని రాయలసీమగా పిలుచుకుందామని నిర్ణయిచారు. అప్పుడు ఉన్న పౌరుషం ఇప్పుడు ఏమైందని కవిత ప్రశ్నించారు. అప్పుడు మీరుఎందుకు భూతల వైకుంఠం  లాంటి  తిరుపతిని  వదులుకుంటున్నారని కేసిఆర్ కూతురు ప్రశ్నించారు.   

అదే సమయంలో సీమాంద్ర నాయకులపై కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలోమండిపడ్డారు. హైదరాబాద్ లో భూకబ్జా  దారిచూపించింది సీమాంద్ర నాయకులేనని అన్నారు. ఈరోజు  కవిత తెలంగాణ బంద్ నిమిత్తం..  తెలంగాణ వాదులతో కలిసి బంద్ లో పాల్గొన్నట్లు సమాచారం. అయితే కవిత ప్రశ్నకు రాయలసీమ నాయకులు ఏమి చెబుతారో చూడాలి.   కొంత మంది తెలంగాణ వాదులు కవిత ఇప్పుడు రాయలసీమ నాయకులను ఎందుకు రెచ్చగొడుతుందో  అర్థంకావటం లేదని  అంటున్నారు.  

రాయలసీమ నాయకులు గానీ, రాయలసీమ ప్రజలు గానీ రాయల తెలంగాణ కోరుకోలేదు, అలాగని ఎవర్ని అడగలేదు. ఎవరో ఇద్దరు, ముగ్గురు నాయకులు తప్పితే, పెద్దగా రాయల తెలంగాణ గురించి పట్టించుకున్న నాయకులే లేరు. అలాంటిది ఇప్పుడు  కవిత మీకు పౌరుషం లేదా,  అని రాయల సీమ నాయకులను రెచ్చగొడితే,   వారు రెచ్చిపోయి రాయల తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తే, అప్పుడు పరిస్థితి ఏమిటని  రాజకీయ నాయకులు అడుగుతున్నారు.   

తిరుపతి గురించి కవిత మాట్లాడటం దారుణంగా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే కవిత మనసులో మాత్రం మరోల ఉందని అర్థమవుతుంది. రాయల తెలంగాణ అయితే ఓకే,  రాయల తెలంగాణ తో పాటు.. చిత్తురు జిల్లా తిరుపతిని కూడా రాయల తెలంగాణలో కలిపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కవిత సీమ నాయకులను రెచ్చగొడుతున్నట్లుగా ఉందని రాజకీయ మేథావులు అంటున్నారు.   

అంటే కవిత మనసులోరాయల తెలంగాణ అంటే.. కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూల్ జిల్లాను కూడా  తెలంగాణ కలిపి రాయల తెలంగాణ చేస్తే అందరికి బాగుంటుందనే ఉద్దేశంలో.. కవిత రాయలసీమ నాయకులను పౌరుషం గురించి ప్రశ్నించినట్లుగాఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనిపై కవితకు రాయల సీమ పౌరుషం నాయకులు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles