Cm kiran vs seemandhra leaders

cm kiran vs seemandhra leaders, congress party, cm kiran samaikyavadi, cm kiran samaikyandhra, cm kiran fire on congress party high command, cm kiran vs telangana bill, 2014 election, cm kiran vs seemandhra people, ap ngos chief ashok babu, samaikyandhra movement, chandrababau naidu, ys jagan, cm kiran vs sonia gandhi, Telangana bill in assembly,

cm kiran vs seemandhra leaders

కిరణ్ పై చిన్న అనుమానం?

Posted: 12/09/2013 10:25 AM IST
Cm kiran vs seemandhra leaders

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై కొత్త అనుమానాలు రేకేత్తున్నాయి. రీసెంట్ గా విజయవాడలో జరిగిన సభలో సిఎం కిరణ్ కాంగ్రెస్ పార్టీపై రెచ్చిపోయిన తీరు అందరికి అనుమానం వస్తుంది. కాంగ్రెస్ పెద్దలపై కారాలు , మిరియాలు నూరిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను, ఒప్పుకోం, ఒప్పుకోం .. పదే పదే పది సార్లు పలికిన సీఎం పై సీమాంద్ర ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సీమాంద్ర ప్రజల ముందే.. గొంతు చించుకొని అరుస్తున్న సీఎం, కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఒక రాజకీయ ప్రకనట కూడా చెయ్యలేదు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో అడ్డుకుంటాం అని పదే పదే చెబుతున్నాప్పడికి సిఎం కిరణ్ పై సీమాంద్ర ప్రజలకు నమ్మకం కుదరటం లేదు. ఒక పక్క ఢిల్లీ పెద్దలు మాత్రం సిఎం కిరణ్ ఎప్పటికి అమ్మ విధేయుడే అని కాంగ్రెస్ పార్టీకి నాయకులే బహిరంగ ప్రకటనలు ఇస్తున్నారు.

 

ముఖ్యమంత్రి ఆప్రకటనలు ఖండించకుండానే.. సమైక్యరాగం పాడుతున్నారు. అంతేకాకుండా సందట్లో సడేమియలాగ.. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మండిపడుతూ.. సీమాంద్ర ప్రజలను మోసం చేస్తున్నాడని, సీమాంద్ర కాంగ్రెస్ నాయకులే గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు. గతంలో సీఎం కిరణ్ చివరి బంతి వరకు పోరాటం చేస్తానని మీడియా ద్వారా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అది తప్పకుండా సిఎం పాటిస్తున్నాడని ఆయన వర్గం అంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ పెద్దలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకం అంటూ ట్యగ్ లైన్ పెట్టుకొని సమైక్యాంద్ర కోసం పోరాటం చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం కిరణ్ తో సంబంధం పెట్టుకున్న ఎపీ ఎన్జీవోల అధ్యక్షుడు పర్చూరి అశోక్ బాబు పై కూడా సీమాంద్ర ప్రజలు మండిపడుతున్నారు.

 

సమైక్యాంద్ర ఉద్యమాన్ని తాకట్టు పెట్టాడనే విమర్శలు అశోక్ బాబు పై సీమాంద్ర ప్రజలు చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి సమైక్యాంద్ర ఉద్యమం పై నీళ్లు చల్లారనే విమర్శలు ఎపీ ఎన్జీవో ఉద్యోగులు మద్య వినిపిస్తున్నాయి. అయితే రోజు ఎపీ ఎన్జీవోల అద్యక్షుడు అశోక్ బాబు సమైక్యాంద్ర ఉద్యమం పై ఈరోజు కార్యచరణ ఏమిటో నిర్ణయిస్తామని చెప్పటం జరిగింది. కానీ అశోక్ బాబు అవినీతి మరకలు ఆ ఉద్యోగుల సంఘాల నుండి వినిపించటంతో.. ఆయన నమ్మకం పోయిందని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. ఇక సమైక్యాంద్ర కోసం పోరాడుతున్న వైఎస్ జగన్ పై సీమాంద్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. చివరకు తెలంగాణ బిల్లు ను సీఎం కిరణ్ ఎలా అడ్డుకుంటారో చూడాలని సమైక్యవాదులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles