Sunanda pushkar philosophical approach

Sunanda Pushkar philosophical approach, Sunanda Pushkar tweets, Union Minister Shashi Tharoor, Shashi Tharoor affair, Pakistani journanlist affair with Tharoor, Sunanda Pushkar mistereous death

Sunanda Pushkar philosophical approach

నవ్వుతూ పోతే పోలే- వేదాంత ధోరణిలో అన్న సునంద!

Posted: 01/18/2014 10:48 AM IST
Sunanda pushkar philosophical approach

శుక్రవారం రాత్రి ఢిల్లీలోని పంచతార హోటల్ లో అనుమానస్పదమైన రీతిలో చనిపోయిన కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ చివరిగా చెప్పిన మాటలలో, హిందూ నమ్మకం ప్రకారం జరగాల్సింది జరగక మానదు కాబట్టి అదేదో నవ్వుతూ పోతే పోలే అని వేదాంత ధోరణిలో చెప్పటం జరిగింది. 
సునంద ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోదలచుకున్న వారికోసం చేసిన ట్విట్టర్ లో సునంద, కిమ్స్ చేసిన వైద్య పరీక్షణలలో ఎన్నో ఆరోగ్య సంబంధమైన విషయాలు బయటపడ్డాయని, ఎవరు ఎప్పుడు పోతారన్న విషయం విధి ముందే నిర్ణయిస్తుంది కాబట్టి ఆ సమయం వచ్చినపుడు తను సంతోషంగా దాన్ని స్వీకరించి పోవటానికి సిద్ధమని తన ట్విట్టర్లో పోస్ట్ చేసారు. 
పాకిస్తాన్ జర్నలిస్ట్ తో తన భర్తకు సంబంధముందని అనుమానించిన సునంద గురించి వచ్చిన వార్తలను ఖండిస్తూ గురువారం నాడు దంపతులిద్దరూ, లేదు మేము చాలా ఆనందకరమైన దాంపత్య జీవితాన్ని సాగిస్తున్నామంటూ మీడియాలో ప్రకటన చేసారు.  కానీ శుక్రవారమే ఆమె శవంగా మారటం పలు అనుమానాలకు దారితీస్తోంది.  ఆమె భర్త శశి థరూర్ ఛాతీలో నొప్పిగా ఉన్న కారణంగా హాస్పిటల్ లో చేరారు. 
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles