Show cause notice to ips for public speech

show cause notice to IPS for public speech, IPS Officer RK Mishra show cause notice, Modi speech in Maithili at Patna, Narendra Modi BJP, BJP PM candidate Modi, Maithili Language poet Vidyapati

show cause notice to IPS for public speech

మోదీని పొగిడినందుకు మొట్టికాయ

Posted: 01/22/2014 04:53 PM IST
Show cause notice to ips for public speech

మొగుడు కొట్టినందుకు కాదు ఆడపడుచు నవ్వినందుకు అన్నట్లు, నరేంద్ర మోదీ మాటల వాడికి, ఛలోక్తులకు తట్టుకోలేక అది కాస్తా బీహార్ లో ఒక పోలీస్ ఆఫీసర్ మీద చూపించటం జరిగింది.  

మోదీ అక్టోబర్ 27 2013 న పాట్నాలో మైథిలి భాషలో ఉపన్యాసం ఇచ్చారు.  అందుకు కారణం లేకపోలేదు.  ఆయన అక్కడకు వెళ్ళిన సందర్భం అలాంటిది.  అక్కడి ప్రజలను ఆకట్టుకోవటానికి ఆయన వాళ్ళ భాషలో మాట్లాడి అలరించారు.  

అయితే,     1986 బ్యాచ్ ఐపిఎస్ ఆర్ కే మిశ్రా దర్బంగా జిల్లాలో నవంబర్ నెలలో విద్యాపతి అనే మైధిలి భాషలో ప్రసిద్ధ కవి వర్ధంతి రోజున మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ మైథిలీ భాషలో మాట్లాడిన ప్రస్తావన తీయటం అతని మీద బడాబాబులు ఉరిమేలా చేసింది.  

ఇంకేముంది షోకాజ్ నోటీస్ పంపించటం జరిగింది.  దానికి మిశ్రా సమాధానం కూడా ఇచ్చారని చెప్పుకొస్తున్నారు పోలీసు అధికారులు.  మిశ్రాని రిలీవ్ చెయ్యమని డిసెంబర్ 27 న హోంమంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన లేఖ ఆధారంగా జనవరి 13 న మిశ్రాని రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చెయ్యటం జరిగింది.  

హోం మంత్రి అమీర్ సుభానీ దానిమీద ఈరోజు వివరణ ఇస్తూ, మిశ్రా బహిరంగ సభలో ఉపన్యాసం ఇవ్వటం వలనే షోకాజ్ నోటీస్ ఇవ్వటం జరిగిందని తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles