Rahul unhappy for shinde handling

rahul unhappy for Shinde handling, AICC Vice President Rahul Gandhi

rahul unhappy for Shinde handling

షిండే తీరుకు ఏఐసిసి విపి రాహుల్ అసంతృప్తి

Posted: 01/23/2014 02:35 PM IST
Rahul unhappy for shinde handling

ఆఆపా నిర్వాహకుడు అరవింద్ కేజ్రీవాల్ చేసిన డిమాండ్ కి షిండే తలవొగ్గి రాజీపడటం అఖిలభారత కాంగ్రెస్ వి.పి. (వైస్ ప్రెసిడెంట్) రాహుల్ గాంధీకి అసంతృప్తిని కలిగించిందని ఎన్డీ టివి వార్తా కథనం ఇచ్చింది.  రాహుల్ గాంధీ తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కేజ్రీవాల్ కి అనుకూలంగా ప్రవర్తించటం బాధాకరమని చెప్పారని తెలియజేసింది.  తన దగ్గరున్న సమాచారం ప్రకారం షిండీ ఈ విషయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను సంప్రదించలేదని తెలుస్తోందని కూడా ఎన్డీటివి చెప్పింది.

అయితే, హోం మంత్రి సుశీల్ షిండే ఆఆపా ఆందోళన విషయంలో వ్యవహరించిన విధానం ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి నచ్చలేదని ఆ విషయంలో రాహుల్ అసహనాన్ని ప్రదర్శించారని వచ్చిన ఎన్ డి టివి వార్త తప్పని న్యూఢిల్లీ పార్లమెంటు సభ్యుడు అజయ్ మాకన్ తన ట్విట్టర్లో తెలియజేసారు. 

శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదన్నట్లుగా హైకమాండ్ ఆనతి లేకుండా ఎంత పెద్ద నాయకుడైనా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి చర్యలు తీసుకోవటం కానీ ఎటువంటి వ్యాఖ్యానాలు కానీ చెయ్యటమనేది జరగదన్నది జగమెరిగిన సత్యం.  అందులోనూ సుశీల్ కుమార్ షిండేలాంటి విశ్వాసపాత్రులు అసలే చెయ్యరు.  ముందు షిండే చేసిన దానికీ ఇప్పుడు అజయ్ మాకన్ ఖండించేదానికీ కూడా అధిష్టానం నుంచి అనుమతులు వచ్చుంటాయన్నది అందరూ నమ్మే నిజం. 

కేజ్రీవాల్ జనాదరణ పొందటం ఢిల్లీ ప్రభుత్వం ఏర్పరచటానికి మద్దతునిచ్చిన కాంగ్రెస్ కి కానీ ప్రధాన ప్రతిపక్షమైన భాజపాకి కానీ ఇష్టం లేదన్నది కూడా అంతే నిజం.  చట్టాన్ని అమలుపరచే పోలీసు శాఖ మద్దతు లేకుండా కోరలు పీకి వేసి మేము మీకు మద్దతునిస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ వలన ఆఆపా ఏమీ చెయ్యలేదన్న కాంగ్రెస్ నమ్మకం మీద దెబ్బ కొడుతున్న కేజ్రీవాల్ ఎందులోనూ కృతకృత్యులవగూడదన్నది కాంగ్రెస్, భాజపాల కోరిక. 

అందువలన కేజ్రీవాల్ విజయం సాధించటం ఇరు వర్గాలకు మింగుడుపడేది కాదు కాబట్టి, రాహుల్ గాంధీ అసహనానికీ, ఆఁ చేసిందేముంది, ముగ్గురు పోలీసు వాళ్ళ సస్పెన్షన్ కోసమా ఇంత డ్రామా అంటూ చేసిన భాజపా వ్యాఖ్యానాలకూ కారణమైంది. 

అంతే కాదు, మతిలేని ముఖ్యమంత్రి అంటూ కేజ్రీవాల్ మీద షిండే మహారాష్ట్రలో చేసిన వ్యాఖ్యానం ఆయనకే తిరిగి తగులుతోందని కూడా ఆయన గ్రహించకపోవటం విశేషం.  కేజ్రీవాల్ మతి లేని ముఖ్యమంత్రైతే ఆయన మాటలకు తలవొగ్గిన తననేమనుకోవాలి, ఆయనకు మద్దతు పలికిన ఆయన పార్టీ కాంగ్రెస్ నేమనుకోవాలి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles