జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లక్కీ హ్యాండ్ అని మరోసారి నిరూపించుకున్నారు. ఓటమితో అల్లాడిపోతున్న వారి పాలిట .. పవన్ ఒక దేవుడే అని.. ఆయన ద్వారా విజయం పొందిన కొంతమంది అంటున్నారు. మొన్నటి వరకు సినిమాలకే పరిమిత మైన పవన్ ‘పవర్’.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆ ‘పవర్’బాగా ఉపయోగపడిందని రాజకీయ నేతలు అంటున్నారు.
వెండితెర పై పవన్ పవర్ :
కమల్ హాసన్ కూతురిగా వెండితెరకు పరిచయం అయిన శ్రుతిహాసన్. ఆమె వద్ద తగినంత గ్లామర్, టాలెంట్ ఉన్నప్పటికి.. లక్క్ లేదు. కోలీవుడ్, టాలీవుడ్ లో పది సినిమాలో చేసినప్పటకి శ్రుతి తగ్గ గుర్తింపు రాలేదు, ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. ఆమె ను ఒకనోక సమయంలో ఐరన్ లెగ్ గా గుర్తించారు. ఆమెతో సినిమా చేస్తే నష్టపోవటం ఖాయమే అనే స్థాయికి నిర్మాతలు, దర్శకులు, హీరోలు వచ్చేసారు.
వరుస పాపులతో అల్లాడిపోతున్నా శ్రుతికి .. పవన్ తో నటించి ఛాన్స్ వచ్చేంది. ఆసమయంలో అందరు పవన్ ప ఫై ఎన్నో విమర్శలు చేయటం జరిగింది. కానీ వాటిని పట్టించుకోకుండా .. శ్రుతితో కలిసి గబ్బర్ సింగ్ గా నటించటం జరిగింది. దీంతో శ్రుతి హాసన్ కాస్త .. భాగ్యలక్ష్మీగా మారిపోయి, కోట్ల రూపాయలు రెమ్మునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగిపోయింది. పవన్ కళ్యాణ్ పవర్ తగలటంతో.. శ్రుతి హాసన్ కు లక్కు కలిసి వచ్చింది. ఇప్పుడు శ్రుతి హాసన్ సినిమాలో ఉంటే ఆ సినిమా హిటే అనే మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
అలాగే హీరో నితిన్.. పవన్ కళ్యాన్ అంటే పిచ్చి అభిమాని, అలాంటి హీరో ..సరైన సినిమాలు లేవు. అలాంటి సమయంలో పవన్ కళ్యాన్ అభిమానం అందిపుచ్చుకొని వరుస విజయాలు సాధించారు.
ఇక రాజకీయల్లో..
జనసేన పార్టీ పెట్టి .. పది వారాలు కూడా కలేదు గానీ, జాతీయ నేతలతో.. రాజకీయ మంతనాలు జరిపిన ఏకైక లీడర్ ఒక్క పవన్ కళ్యాణ్. అధికారం కోసం పది సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నా బిజేపి, టిడిపి , చంద్రబాబుకు ..పవన్ ఒక సంజీవలా దొరికాడు. బాబు 2014 లో అధికారం కోసం.. 64ఏళ్ల వయసులో కూడా పాదయాత్ర చేయటం జరిగింది. అయిన టిడిపి పై ప్రజలకు నమ్మకం కలగలేదు. ప్రత్యర్థి పార్టీలతో.. చంద్రబాబు నిత్యం యుద్దం చేస్తూనే ఉన్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యం.
ఇలాంటి సమయంలో.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ సపోర్టు.. చంద్రబాబుకు దక్కింది. చంద్రబాబు, పవన్ కలయిక పై ఆ పార్టీలోని ఒక వర్గం వారు.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు, కామెంట్ చేశారు, కానీ చంద్రబాబు మాత్రం పవన్ పై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. పవన్ లో ఒక మంచి గుణం ఉంది. తనపై నమ్మకం పెట్టుకున్నవారికి ఎప్పుడు న్యాయమే చేస్తాడు. అదే రీతిలో.. 2014 ఎన్నికల ప్రచారంలో.. సీమాంద్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తరుపున బాబు, నరేంద్ర మోడీలతో కలిసి పవన్ ప్రచారం చేయటం జరిగింది.
ఇప్పుడు పవన్ ప్రచారం, బాబు కష్టపడిన తీరుకు.. సీమాంద్ర ప్రజలు పట్టం కట్టారు. పవన్ పవర్ తో..చంద్రబాబు సీమాంద్ర లో ముఖ్యమంత్రి స్థానం కైవనం చేసున్నారు. ఇప్పుడు ఆ పార్టీలోని నేతలు, ఆయన అభిమయనులు , చంద్రబాబు సన్నిహితులు, పవన్ ది లక్కీ హ్యండే అని అంటున్నారు.
అయితే కొంతమందికి మరో అనుమానం రావచ్చు.. అన్నయ్య చిరంజీవికి పవన్ లక్కీ హ్యాండ్ ఎందుకు కలిసిరాలేదు? అంటే అప్పుడు పవన్ కు లక్కీ పవర్ లేదా ? అనే సందేశాలు వస్తాయి. నిజమే కానీ ఆ సమయంలో.. పవన్ ఒక కార్యకర్తగానే.. పార్టీకి సేవాలు చేయటం జరిగింది. కానీ ఇప్పుడు ఒక నాయకుడిగా తెలుగు ప్రజలకోసం, సరైన నిర్ణయం తీసుకున్నారు. మంచి చేసే మంచి మనసున్న పవన్ కళ్యాన్ కు అంత మంచే జరుగుతుంది. ఆయన్ని నమ్మకున్న వారికి న్యాయం జరుగుతుందని ..ఆయన అభిమానులు అంటున్నారు.
జై సీమాంద్ర, జై తెలంగాణ, జై నరేంద్ర మోడీ, జై చంద్రబాబు, జై కేసిఆర్, జై దేశ ప్రజలు., జై జై తెలుగు ప్రజలు.. ...జై హింద్..!!!
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more