ఇప్పడు ప్రపంచ దేశలు సైతం నరేంద్ర మోడీ పై చూస్తున్నాయి. ఇక దేశమంతతా నరేంద్ర మోడీ హవా కొనసాగుతుంది. భారత్ దేశంలోకి మోడీ పవనాలు రావటంతో.. దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నమో మంత్రంతో బిజేపి పార్టీ విజయం వైపు దూసుకుపోయింది. ఆయన హవాలో యుపిఎ తుత్తునియలైంది. ప్రతిపక్ష పార్టీకి ఉండాల్సిన కనీస మెజార్టీ కూడా కాంగ్రెస్ సొంతం చేసుకోలేకపోయింది.
అయితే బిజెపి అప్రతిహాత విజయానికి కేవలం మోడీ ఒక్కరే కారణం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఐదు ప్రధాన కారణాలతో బిజెపి దేశంలో సునామీ సృష్టించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
అ) అవినీతిమయమైన యూపీఏ పాలన..!!
కాంగ్రెస్ హయాంలో కనీవినీ ఎరుగనంత అవినీతి చోటుచేసుకుంది. అటు ప్రధాని మన్మోహన్గాని ఇటు సోనియాగానీ దోపిడీగాళ్ల దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారు. చివరకు సోనియా అల్లుడిపైనా తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కోల్స్కాం, 2 జి కుంభకోణంలాంటి లక్షల కోట్ల అవినీతికి సింగ్ సర్కార్ వేదికైంది. అవన్నీ కొడుకుని ప్రధానిని చేయాలన్న సోనియా ఆశల్ని కూల్చివేశాయి. మోదీకి కలిసివచ్చాయి.
ఆ) గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్ధ..!!
యుపిఎ హయాంలో భారత్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోయింది. ప్రధాని మన్మోహన్సింగ్ ప్రపంచస్థాయి ఆర్థిక నిపుణుడైనా పతనమైపోతున్న దేశ పరిస్థితిని చక్కబెట్టలేకపోయారు. కానీ మోడీ గుజరాత్ తరహా అభివృద్ధి అంటూ ఓటర్లను తనవైపుకు తిప్పుకోగలిగారు. ఇదే సమయంలో దేశంలోని 28 రాష్ట్రాల్లో గుజరాత్ ఆర్థిక పరిస్థితి టాప్ ప్లేస్లో ఉండడం ప్రజల దృష్టిని ఆకట్టుకోగలిగింది.
ఇ) యూపీఏ పాలనపై విసుగు..!!
మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ వైఫల్యం ఎన్నికల్లో ఆ పార్టీని కూల్చేయడానికి కారణమైంది. రోడ్లు, పోర్టుల నిర్మాణం, విద్యుచ్చక్తి ఉత్పాదన తదితర అనేక అంశాల్లో కాంగ్రెస్ ఫెయిలైంది. ఇదే సమయంలో నమో అభివృద్ధి మంత్రం ఓటర్లను బాగా ప్రభావితం చేసింది. మొత్తంగా యుపిఎ పదేళ్ల పాలనపట్ల ప్రజలు విసుగెత్తిపోయారు.
ఈ) ఉద్యోగాల కల్పన..!!
కాంగ్రెస్ సర్కార్ అవినీతి, ఉద్యోగాలు కల్పించడంలో వైఫల్యం పట్ల యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాము అధికారంలోకొస్తే కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని తన హామీలను నిలబెట్టుకోలేకపోయారు. అంతకంతకూ పెరుగుతున్న నిరుద్యోగిత శాతం బిజెపి గెలుపుకు పూలబాట పరిచింది. మరోవైపు లౌకికత్వం ముసుగులో కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాద చర్యలను అడ్డుకోలేకపోవడం యువతలో అసహనం కలిగించింది.
ఉ) మోడీ విస్తృత ప్రచారం..!!
మోడీ విక్టరీకి సామాజిక మీడియా, టెక్నాలజీ పరోక్షంగా సహకరించాయి. త్రీజి టెక్నాలజీ సాయంతో ప్రచారం విషయంలో కాంగ్రెస్ కన్నా ఒక అడుగు ముందున్నారు. మరోవైపు మీడియా చానెళ్లు ఆయనదే గెలుపంటూ ముందస్తు విజయాన్నందించాయి.
ఈ ఐదు కారణాలతో.. బిజేపి పార్టీ దేశంలో విజయం సాధించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఇందుకు ఒప్పుకుంటున్నారు. ఇక మోడీ పాలన ఎలా ఉంటుందో చూడాలి.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more