Chandrababu naidu to assume charge as chief minister after june 8

Chandrababu Naidu to Assume Charge, Naidu to Take Oath After June 8, Chief Minister After June 8, TDP chief N Chandrababu Naidu, Bifurcation process on track for June 2 deadline, State of AP.

Chandrababu Naidu to Assume Charge as Chief Minister After June 8

బాబు ప్రమాణం అనుమానమే?

Posted: 05/23/2014 12:28 PM IST
Chandrababu naidu to assume charge as chief minister after june 8

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ప్రమాణం చేయటం అనుమానమే అని ఆ పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. అంటే వచ్చేనెల ఎనిమిదో తేదీలోపు విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాల్లేవని అంటున్నారు. అంటే మీరు మరోలా అనుకోకండి. పది సంవత్సరాలత మళ్లీ పదవి దక్కటంతో.. చంద్రబాబు కొంచెం కేర్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఇప్పుడు రాష్ట్రం లో వాస్తు, శుభగడియలు పై రాజకీయ నాయకులు చాలా జాగ్రత్త పడుతున్న విషయం తెలిసిందే. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ప్రమాణ స్వీకారం చేయడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మంగళగిరి సమీపంలోని నాగార్జున విశ్వ విద్యాలయ తో వద్ద నుంచి విధులు నిర్వర్తించాలని తెదేపా అధినేత భావిస్తున్నారు.

అయితే దీనికి కారణం వచ్చేనెల 8వ తేదీలోగా ప్రమాణ స్వీకారం చేయడానికి శుభ గడియలు లేవని చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన జ్యోతిష్కులు సూచించినట్లు సమాచారం. వారి సలహాల మేరకు చంద్రబాబు నాయుడు జూన్ ఎనిమిదవ తేదీ తర్వాత ప్రమాణ స్వీకారాన్ని ఖరారు చేయాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

బాబు ఆలోచన మరోలా ఉందని అంటున్నారు. పదేళ్ల తరువాత వచ్చిన అధికారాన్ని ఐదేళ్లే పాటే కాకుండా లాంగ్ టైమ్ ఉండే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే.. బాబు ప్రతి అడుగు ఆచి తూచి ముందుకు పోతున్నాడని పార్టీలోని సినియర్ నాయకులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles