Mim and bjp over telangana logo fighting

Telangana Logo fighting, MIM and BJP logo fighting, kcr, trs party, telangana state logo fighting, MIM chief Asaduddin Owaisi, election 2014,

MIM and BJP over Telangana Logo fighting

ఛార్మినార్ పై కొట్టుకున్న కేసిఆర్-ఎంఐఎం నేతలు?

Posted: 05/26/2014 05:51 PM IST
Mim and bjp over telangana logo fighting

తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసిఆర్ ..ఒక పెను సమస్య ఎదురైంది. ఇప్పటి వరకు తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీకి కొత్త కష్టాలు వచ్చాయి. ముంచుకొస్తున్న జూన్ 2 తేదీతో.. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంఐఎం నేతలు, బిజేపీ లీడర్స్ ల మద్య సరికొత్త వివాదం మొదలైంది. కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ ప్రభుత్వ లోగో ఎలా ఉండబోతోంది ? టిఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంపై బిజెపి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనితో లోగోపై వివాదాలు నెలకొంటున్నాయి.

ఎంఐఎం - బిజెపి పార్టీల మధ్య చిచ్చు రేగుతోంది. లోగోలో చార్మినార్ బొమ్మ ఉండాలని ఎంఐఎం..ఉండవద్దని బిజెపి..వీరిద్దరి నడుమ టిఆర్ఎస్ పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే లోగో డిజైన్ పూర్తి చేయాలని టిఆర్ఎస్ పార్టీ భావిస్తుండగా అడుగడుగునా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. లోగో రూపకల్పన విషయంలో తెలంగాణ మేధావులు, ఉద్యమ సంఘాల నేతలు సూచనలు, సలహాలిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఎంఐంఎం నేతలు వచ్చి ఓ సలహా ఇచ్చారు. లోగోలో చార్మినార్ చిత్రాన్ని చేర్చాలంటూ ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదనకు కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వరంగల్ తోరణంలో చార్మినార్...దానిలోపల అమరవీరుల స్తూపం..తెలంగాణ చిత్రపటం ఉండేలా డిజైన్ సిద్ధం చేశారు. అయితే ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. లోగో పై బిజేపి నాయకులు అభ్యతరం చెబుతున్నాయి. ఓ వర్గానికి చెందిన చార్మినార్ చిహ్నాన్ని రాష్ట్ర లోగోలో ఎలా చేరుస్తారంటూ మండిపడుతోంది. గతంలో మజ్లీస్ నేతలు చాలాసార్లు చార్మినార్ తమదేనంటూ చెప్పుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా బిజెపి నేతలు గుర్తు చేస్తున్నారు.

మజ్లీస్ ఒత్తిళ్లకు లొంగి లోగోలో చార్మినార్ చిత్రాన్ని ఉంచితే..ఉద్యమకారుల్ని అవమానపరిచినట్లేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. లోగో రూపకల్పన విషయంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయం సేకరించాలని ఆయన సూచిస్తున్నారు. ఇలా మజ్లీస్, బిజెపిల ఒత్తిళ్ల నేపధ్యంలో లోగో డిజైన్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే, కేంద్రంలో అధికారం చేపట్టబోతున్న బిజెపి మాట నెగ్గుతుందా...లేక, టిఆర్ఎస్ దోస్తీ కోరుకుంటున్న మజ్లీస్ పంతం నెగ్గుతుందా? అని హైదరాబాద్ లో.. భారీలో ఎత్తున్న బెట్టింగులు జరుగుతున్నాయి. అయితే చివరకు ఎవరి మాట నెగ్గుతుందో కొన్ని రోజుల్లో తెలుస్తోంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles