జనసేన అధినేత కె. పవన్ కళ్యాణ్ చెప్పినట్లే జరుగుతుందనే విషయాన్ని చాలా లేటుగా గుర్తించారు తెలంగాణ నేతలు, తెలంగాణ ప్రజలు. మోడీ ప్రమాణ స్వీకారాని వెళ్లిన .. తెలంగాణ ముద్దు బిడ్డ కేసిఆర్ కు బాగా అర్థమైంది. ‘‘నోరు మంచిదైతే.. ఊరు మంచితవుతుందనే ’’సామోత ..మోడీ సభ ద్వారా తెలిసింది. ఇంకా ముఖ్మమంత్రి పగ్గాలు చేతిలోకి రాకముందే ఢిల్లీలోకే కేసిఆర్ కు ఘోర అవనమానం జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణకు రారాజైన.. కేంద్రంలో మాత్రం ఒక రాజకీయ నేతగానే మిగిలిపోయారు.
ఇలాంటి విషయాలను పవన్ కళ్యాన్ ముందుగానే పసిగట్టి.. కేసిఆర్ గారు మీరు నోరు అదుపులో పెట్టుకోండి? మీ మాటల దూకుడ వల్ల .. తెలంగాణ ప్రజలు, ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని ఎన్నికల సాక్షిగా చెప్పటం జరిగింది. కేవలం ఓటు బ్యాంకు కోసమే కేసిఆర్ తన తిట్ల పురణంతో.. ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేయటం జరిగింది. కేసిఆర్ అన్న మాటలకు కొన్ని పార్టీల నాయకులు సిగ్గుతో చితికిపోయిన విషయం తెలిసిందే.
ప్రజాస్వామ్యంలో.. వాక్ స్వాతంత్రం ఉందని.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే.. తరువాత వీపు మీద పడే వాతలకు మందు రాసుకోలేక చావాల్సి వస్తుందని గతంలో పవన్ చెప్పటం జరిగింది. కాబోయే ప్రధాని అయిన నరేంద్ర మోడీ పై కేసిఆర్ శివ తాండవం చేయటం జరిగింది. అదే బాటలో.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని సైతం.. వదిలిపెట్టకుండా.. దుమ్ముదులిపేశారు కేసిఆర్ . ఆ సమయంలో ఆయన ఆలోచించి , ఆగ్రహంతో జాతీయ నేతల పై మాటల కామెంట్ చేశారో, లేక అధికారం కోసం అన్నారో తెలియదు గానీ ..అప్పటి ఫలితం నిన్న ఢిల్లీలో కనబడిందని .. తెలంగాణ నేతలు అంటున్నారు.
రాష్ట్రం ఏర్పాడుతున్న సమయంలోనే.. తెలంగాణ పెద్దలు, నేతలు ఆచి తూచి అడుగులు వేయలని పవన్ కళ్యాణ్ సూచించారు. రాజకీయ పార్టీలపై , రాజకీయ నేతల పై విమర్శలు చెయకండని సుతిమెత్తగా చెప్పటం జరిగింది. తెలంగాణ నేతలు.. ప్రతి ఒక్కరితో సున్నం పెట్టుకుంటే.. భవిష్యత్తులో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని, దీంతో తెలంగాణ ప్రజలకు తీరాని నష్టం జరుగుతుందని పవన్ చెప్పటం జరిగింది. కాబోయే దేశాని ప్రదాని పై కామెంట్స్ వద్దని కేసిఆర్ కు పవన్ హితువు పలికారు.
కానీ కేసిఆర్ మాత్రం ఆంద్రోడు చెబితే.. మేం వినాలా? అంటూ.. నరేంద్ర మోడీని ప్రతి రాజకీయ సభలో మాటల తూటాలతో అవమానించారు. పవన్ చెప్పిన మాటలను కొంచెం కూడా పట్టించుకోకుండా.. ఆవేశంగా కేసిఆర్ ముందుకు పోవటం జరిగింది. కానీ ప్రతి రోజు మనకు అనుకూలంగా ఉండవు. ‘‘ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది ’’ ఆరోజు ఏం జరుగుతుందో అందరికి తెలుసు. ఇక నరేంద్ర మోడీ పైనే కాకుండా.. నమ్మకంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పై కేసిఆర్ విరుచుకపడ్డా విషయం తెలిసిందే. తెలంగాణ ఇచ్చిన వెంటనే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి, తరువాత తూచ్ అంటూ. మాట మార్చారు కేసిఆర్. తెలంగాణ ఇచ్చినందుకు సోనియా దేవత అన్న నోటీతోనే.. ఎన్నికల సమయంలో సోనియా గాంధీ పెద్ద దేయ్యం అని కాంగ్రెస్ నేతలకు షాకిచ్చారు.
దీంతో సోనియా గాంధీ ఆగ్రహాన్నీ కేసిఆర్ ముటగట్టుకున్నారు. నిన్న ఢిల్లీలో కేసిఆర్ , సోనియా గాంధీల మద్య విచిత్ర సన్నివేశం నడిచింది. మోడీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్బంగా.. వెళ్లిన కేసిఆర్ సోనియా గాంధీకి అభివాదం చేసిన.. ఆమెమాత్రం కేసిఆర్ చూడనట్లే ముందుకు వెళ్లిపోయారు. ఆ సమయంలో కేసిఆర్ అనుసరించిన వైఖరి వల్లే మేము భారీగా నష్టపోయామనే భావనలోనే సోనియా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
మోడీ మొదటి దెబ్బ ..నాలుగు రాష్ట్రాలను ఒకేసారి తాకింది. ఆ నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తనను తీవ్రంగా విమర్శించిన కేసిఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో .. ఆ ప్రభుత్వానికి తమ సహకారం ఎంత పరిమితంగా ఉంటుందో మోడీ తన కేటాయింపుల ద్వారానే బయట పెట్టారని తెలంగాణ నేతలే అంటున్నారు.
అందుకే..పవన్ చెబుతునే ఉన్నారు..కాస్తంత ముందుచూపతో పాటు .. ఆచితూచి మాట్లాడటం .. అనవసరమైన నిందలు వేయటం ద్వారా తాత్కలిక రాజకీయ ప్రయోజనం దక్కుతుందేమో కానీ.. దానికి మించిన సవాళ్లు ఎదురుకోవాల్సి వస్తుందనే విషయం మోడీ ద్వారా నిజమైందని.. తెలంగాణ ప్రాంత నేతలు అంటున్నారు. పవన్ కు రాజకీయ అనుభవం లేదని, రాజకీయల మీద అవగాహన లేదని అన్నారు.
పవన్ కు చాలా ముందు చూపు ఉందని అందుకే బిజేపితో జతకట్టి, తన వంతుగా .. పార్టీ విజయానికి సాయం చేయటం జరిగిందని తెలంగాణ బిజేపి నాయకులు అంటున్నారు. అందుకే వయసులో చిన్నవాడైన .. తెలుగు ప్రజల అభివ్రద్ది, కష్టాసుఖాలు అర్థం చేసుకున్నాడు కాబట్టి , ఈరోజు ఢిల్లీ స్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మారుమోగుతుందని తెలుగు ప్రజలు అంటున్నారు.
‘‘ఎంత బలమైన ఏనుగు కూడా చిన్న పల్లేరు కాయల ముల్లును చూస్తే.. గజగజ వణికిపోతుంది’’ కేసిఆర్ నిజమైన రాజకీయ మేథావే..కానీ అప్పడుప్పుడు ..ఇలాంటి చిన్న చిన్న తప్పులు ..చేసి, పెద్ద ఫలితం అనుభవిస్తున్నాడు. ఈయనతో పాటు ..తెలంగాణ ప్రజలు కూడా ఆ ఫలితం అనుభవించాల్సిన సమయం ఆసన్నమైందని.. కాంగ్రెస్ నేతలు, తెలంగాణ పెద్దలు అంటున్నారు.
ఇకనైన తెలంగాణ ప్రజలకు గురించి ఆలోచించాలని తెలంగాణలో చదువుకున్న యువతి, యువకులు కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ‘‘నాయకుడి మంచి వాడైతే.. ఆయన పాలనలోప్రజలకు ఎలాంటి కష్టాలు ఉండవు’’ నేత మంచి వాడైతే.. ఆ ప్రాంతం మంచిదవుతుందని.. నరేంద్ర మోడీ నిరూపించారు. శత్రువు దేశాలను సైతం .. మోడీ ప్రమాణీ స్వీకారానికి పిలవటమే. మోదీ గొప్పతన బయటపడిందని .దేశ ప్రజలు అంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more