భారత దేశ ప్రదాని నరేంద్ర మోదీ కోట్లాది భారతీయులకు 26 విషయాలు చెప్పటం జరిగింది. ఇది మోదీ శకం. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఇది అక్షరాలా నరేంద్రమోడీ శకమే. కోట్లాది భారతీయులు ఆత్మవిశ్వాసాన్ని, హృదయ స్పర్శను నమ్మి, విశ్వసించి, ఓటేసి గెలిపించిన మోడీ శకం ఇక మొదలైంది.
మోదీ భారత ప్రధానమంత్రిగా సమస్త భారతదేశంతో పాటు.. ప్రపంచ దేశాలు సైతం ఆయనికి ఏం చేయనున్నారని కుతూహలంతో, ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగా, రాజకీయ నేతగా, సుదీర్ఘ కాలంపాటు గుజరాత్ పాలకుడిగా నరేంద్రమోడీ తన గురించి తాను చెప్పుకున్న విశేషాలు ఆసక్తి గొలుపుతున్నాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ కొన్నాళ్ల క్రితం చెప్పుకున్న 26 విషయాలు ఇవే.
అ) నేను రోబోట్‌ని కాను. నేనొక సామాన్యుడిని. నాకూ బలహీనతలున్నాయి కాని నేను మంచి ఆదర్శాలను పాటించడానికే ప్రయత్నిస్తాను.
ఆ) నా భద్రత గురించి నేనెన్నడూ పట్టించుకోను. గతంలోనే కాదు.. భవిష్యత్తులో కూడా దీన్ని నేను పట్టించుకోను. పాట్నాలో నా ర్యాలీలో పేలుళ్లు సంభవించినప్పడు నేను బతికి బయటపడ్డాను. దేవుడే కాపాడాడు. నేను బతికే ఉండాలని దేవుడు భావించాడు. ఆ దేవుడే నన్ను కాపాడతాడు.
ఇ) నా లౌకికపరమైన విశ్వసనీయతపై సందేహాలు ఉన్న వారిని గుజరాత్ సందర్శించి పది రోజులు ఇక్కడ గడపాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను.
ఈ) నా మాటల కంటే నా చేతలే ఎక్కువగా నేనేంటో చెబుతాయి.
ఉ) గాంధీజి సైతం కాంగ్రెస్ అంతమైపోవాలని కోరుకున్నారు.
ఊ) అవినీతి, వారసత్వ రాజకీయాలు, దుష్పరిపాలన.. దేశంలోని అన్ని సమస్యలకూ కాంగ్రెస్ పార్టీనే ఆధారం. కాంగ్రెస్‌తో ముడిపడని రాజకీయ సమస్య ఒక్కటి కూడా లేదు.
ఎ) గత పది సంవత్సరాలు భయంకరమైనవి. తనకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకాన్ని సామాన్యుడు కోల్పోయాడు. ఆ నమ్మకాన్ని నేను కల్పించగలను.
ఏ) సామాన్యులకే నా రాజకీయాలు.. ధనవంతుల కోసం కాదు.
ఐ) ప్రతి రాష్ట్రమూ తనదై అభివృద్ధి నమూనాను కలిగి ఉండాలి. గుజరాత్ నమూనాను అన్నిచోట్లా అమలు చేయలేం. చివరకు గుజరాత్లో కూడా ప్రతి జిల్లాకు ఒక విభిన్నమైన నమూనా ఉంది.
ఒ) అందరూ డోక్లా (గుజరాత్ ప్రత్యేక పలహారం) నే తినేలా చేయలేను. కొందరు ఇడ్లీ తింటే కొందరు పరాటాలు తింటారు. ప్రతి రాష్ట్రమూ, జిల్లా తన స్వంత అభివృద్ధి నమూనాను పెంపొందించుకోవాలని నా విశ్వాసం.
ఓ) నేను గుజరాత్ ముఖ్యమంత్రిని అయినప్పుడు భోజనం సమయంలో అయినా విద్యుత్తును ఇవ్వమంటూ అనేకమంది నన్నడిగారు.
ఔ) ఇప్పుడు గుజరాత్లో 24 గంటలూ విద్యుత్ ఉంది. ఏదీ అసాధ్యం కాదు. భారతదేశంలో కూడా ఇది సాద్యమే.
అం) భారత దేశంలో ఎన్నికల్లో విదేశీ విధానంపై పోరాటం సాగదు ఉపాధి, ఆహార ధరలు వంటి అంశాలపైనే ఎన్నికల పోరాటం ఉంటుంది.
అ:) నా శక్తి విషయంలో ఎలాంటి రహస్యం లేదు. ప్రజలు నన్ను కష్టించి పని చేసే కూలీలాగా చూస్తున్నారు.
క)కూలీలా పనిచేయడం నా కిష్టం కూడా. అత్యున్నత స్థానాల్లో ఉన్న రాజకీయ నేతలు ఏమీ చేయడం లేదనే సాధారణ అభిప్రాయం దేశంలో బలపడిపోయింది. నేను దాన్ని బద్దలు గొట్టాలని భావిస్తున్నాను.
ఖ) మన దేశీయ సమస్యలు పరిష్కారమైతే అంతర్జాతీయ వేదికపై మనం మరింత బలంగా ఉంటామని నా నమ్మకం.
గ) ప్రియాంకా గాంధీ, వాద్రాలపై వ్యాఖ్యానించబోను. అభివృద్ధి, సుపరిపాలనపైనే నా దృష్టి ఉంటుంది.
ఘ) కక్షసాధింపు, లీగల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం నాకు తెలీవు. అవినీతి కేసులకు సంబంధించినంతవరకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయ జోక్యం ఉండదు.
ఙ) భారతీయ మీడియా నా పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తూ వస్తోంది.
చ) పత్రికాధిపతులు నన్ను నిందించడం, దూషించటమే పనిగా పెట్టుకున్నారు. యూట్యూబ్ లోకి వెళ్లి చూసినట్లయితే నన్ను ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్న క్లిప్‌లను అనేకం మీరు చూడవచ్చు. అంతకుమించి వాటిలో మరేమీ ఉండవు.
ఛ) మన యువతరం చాలా చురుగ్గా ఉంటోంది. వేష భాషల్లో కాదు. వారు తమ దృష్టికి వచ్చిన వాటిని తిరిగి పరిశీలించి తమదైన అభిఫ్రాయాన్ని కలిగి ఉంటున్నారు. ఇది గూగుల్ జనరేషన్. నా వేషధారణను వారు ఏమారిపోవడం లేదు. వారు సుపరిపాలన కోరుకుంటున్నారు.
జ) రాజకీయ నేతలందరూ అవినీతిపరులే అనే తప్పు ముద్రను మీడియా సృష్టించింది. కాంగ్రెస్‌లో సైతం మంచి వ్యక్తులు ఉన్నారు.
ఝ) నేను ప్రదానమంత్రిని కాకపోయినట్లయితే మంచిదే. నేను తిరిగి టీ అమ్ముకోవడానికి వెళతాను. దాంట్లో నాకే తప్పూ కనిపించడం లేదు. జైరాం రమేష్ లాగా ఒక కుటంబాన్ని సంతోషపెట్టడంపై నా పని ఆధారపడి ఉండదు.
ఞ) కుల ప్రాతిపదికన వోటు బ్యాంకు రాజకీయాలకు నేను వ్యతిరేకం. వోట్లు సాధించడానికి నా ఒబిసి నేపథ్యాన్ని నేనెన్నటికీ ఉపయోగించను. నా పేదరికాన్ని కూడా ఓట్ల కోసం ఉపయోగించుకోను. నేనలాంటి మనిషిని కాను.
ట) స్టాక్ మార్కెట్ అత్యున్నత స్థాయిని అందుకుంటున్నప్పటికీ రేటింగ్ ఏజెన్సీలు తనకు ఎందుకు ఘనతను ఆపాదించడం లేదని చిదంబరం తన్ను తాను ప్రశ్నించుకోవాలి.
ఠ) నేనింకా ప్రధానమంత్రిని కాలేదు. విదేశీవిధానం వంటి అంశాలపై నేను వ్యాఖ్యానించడం సముచితం కాదు.
ఇవీ దేశం ముందు మోడీ తనగురించి చెప్పుకున్న విశేషాలు. ఇంతవరకు దేశం మోడీ మాటలనే విన్నది. ఇప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయన వేసే ప్రతి అడుగును దేశం నిశితంగా పరిశీలుస్తూంటుంది. మోడీ నిజంగానే అభివృద్ధి నమూనాను దేశమంతటా సృష్టించగలడా. ఇదే అసలు సిసలు సమస్య. కాని జాతి ఆయనను ఇప్పుడు నమ్ముతోంది. ఆయన ఏం చేయగలరు, ఏం చేయబోతున్నారు అన్నది సమీప భవిష్యత్తులోనే తేలిపోతుంది.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more