ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో భేటీ అవటంతో ఆయన భాజపాలో చేరతారని కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు నిజమేనేమో అనిపిస్తోంది.
కిషన్ రెడ్డితో చర్చల అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి భాజపా లో చేరటానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
గురువారం ఉదయం 11.00 గంటలకు కిషన్ రెడ్డితో కిరణ్ కుమార్ చేసిన సమావేశం 45 నిమిషాలపాటు నడిచింది. వాళ్ళిద్దరూ రాష్ట్రంలోని పలు రాజకీయ అంశాలమీద చర్చించుకున్నట్లుగా సమాచారం. కానీ, జరిగింది కేవలం మామూలు మాటలేనని రాజకీయంగా ఏమీ మాట్లాడుకోలేదని కిషన్ రెడ్డి అన్నారు. కేవలం తను వెళ్తున్నప్పుడు కనిపించిన కిరణ్ కుమార్ రెడ్డితో మర్యాదపూర్వకంగానే మాట్లాడటం జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు.
అయితే, విశ్వసనీయమైన వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి 30 మంది అనుచరులతో భాజపా లో చేరటానికి సిద్ధపడగా అందుకు అధిష్టానం నుంచి కూడా
అనుకూల సంకేతాలు వచ్చాయని, ఈ రోజు వాళ్ళిద్దరి భేటీకి కూడా అదే కారణమని తెలుస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more