Telangana cm kcr taking different decisions

telangana cm kcr taking different decisions : telangana cm kcr creating new sensationals by taking extraordinary decisions in telangana

telangana cm kcr taking different decisions

పరిస్థితులు బాగులేవని భయపడుతున్న సీఎం కేసీఆర్!

Posted: 09/05/2014 12:10 PM IST
Telangana cm kcr taking different decisions

(Image source from: telangana cm kcr taking different decisions)

విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్... తొలుత రాష్ట్రాభివృద్ధికోసం తన సత్తా చాటినప్పటికీ.. ప్రస్తుతం ఆయన పరిస్థితులు బాగులేవంటూ భయపడుతున్నట్టు తెలుస్తోంది. మిగులు బడ్జెట్, హైదరాబాద్ మహానగరం అండతో కేసీఆర్ అభివృద్ధి పనులను సులభతరంగా చేపడుతున్నప్పటికీ... కొన్నికొన్ని విషయాల్లో ఆయన తడబడుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం గద్దెనెక్కి వందరోజులు పూర్తి చేసుకొంటున్న తరుణంలో... మొదటిరోజుల్లో దానికంటే ప్రస్తుతం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరులో చాలా మార్పులు కనిపిస్తున్నాయని వెల్లడిస్తున్నారు. వీటన్నిటినీ దీర్ఘంగా గమనిస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ భయపడుతున్నారని.. అందుకే ఇటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నారని రాజకీయరంగంలో వినిపిస్తున్న తాజా వార్తలు!

అధికారంలోకి వచ్చిన వెంటనే తన సత్తాతో హైదరాబాద్ లో వున్న అక్రమకట్టడాలు, ఇతర వ్యవహారాలమీద వేగంగా పనులను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి తన పార్టీపై దృష్టి సారించారు. తెలంగాణా మొత్తం టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నప్పటికీ.. పార్టీ బలంగా లేదని భావించిన ఆయన ప్రస్తుతం దాని బలోపేతం కోసం పాట్లు పడుతున్నారు. కేసీఆర్ క్యాబినెట్ లో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషకులు తెలుపుతున్నారు. కేవలం క్యాబినెట్ విస్తరణ కాదు..  మొత్తం క్యాబినెట్ నే కేసీఆర్ పునర్య్వవస్థీకరణరించనున్నారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా కేసీఆర్ దీనిమీద దృష్టి ఎందుకు పెట్టారోనన్న విషయం అర్థంకాక అందరూ గందరగోళ పరిస్థితిలో వుండిపోయారు.

ఇదిలావుండగా.. కేసీఆర్ తన కాన్వాయ్ లోని వాహనాల రంగును కూడా మార్పించాయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. నలుపు తనకు అచ్చిరావడం లేదని ఆయన తెల్ల ఫార్చూనర్లు కావాలని కోరినట్లు వార్తలొస్తున్నాయి. తనకోసం ప్రత్యేకంగా నాలుగు తెల్ల ఫార్చూనర్లను ఏర్పాటు చేయాల్సిందిగా కేసీఆర్, అధికారులకు ఆదేశాలు జారిచేసినట్లు ఇన్ సైడ్ టాక్! అయితే కొత్త కార్లను కొంటారో.. లేక ప్రస్తుతమున్న నల్ల వాటినే తెల్లగా మార్చుతారేమోనన్న విషయం మాత్రం ఇంకా క్లారిటీ కావట్లేదు! అలాగే ఇతర విషయాలలో కేసీఆర్ త్వరలోనే చాలా మార్పులు చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, తన కాన్వాయ్ లోని ఫార్చూనర్ల రంగుల మార్పిళ్లను బట్టి చూస్తుంటే... కేసీఆర్ పరిస్థితుల ప్రభావంతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు విశ్లేషకులు తెలుపుతున్నారు.

ఏదిఏమైనా.. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఇతర సీఎంలతో పోల్చుకుంటే చాలా ప్రత్యేకంగానే వుంటాయి. ఇన్నాళ్లవరకు ఎవరూ చేయని విధంగా కేసీఆర్ గోల్కొండ కోట మీద జెండా ఎగురవేసి సరికొత్త సంచలనాన్ని తిరగరాశారు. అలాగే నిజాంపాలన కాలంనాటి భవనాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి, వాటి పునరుద్ధరణకు నడుం బిగించారు. అలాగే పోలీసుశాఖ వాహనాలను మార్చేసి అంతర్జాతీయ మార్క్ ను కొట్టేశారు. ఆ తరహాలోనే కొంచెం వెరైటీగా వుండేందుకు కేసీఆర్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, కాన్వాయ్ రంగుల మార్పిడి చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  telangana state  kcr cabinet  political news  telugu news  

Other Articles