Kcr chandrababu naidu on farm loans

kcr, chandrababu, kcr news, chandrababu news, kcr chandrababu naidu, kcr latest news, chandrababu latest news, farm loans, central government, telangana farmers, andhra pradesh farmers, tdp party ministers, trs party ministers

kcr chandrababu naidu on farm loans : the farmers of ap and telangana getting angry with the decisions of their states cm

తెలుగు చంద్రులైన కేసీఆర్ - బాబులకు దమ్ములేదా..?

Posted: 09/06/2014 01:21 PM IST
Kcr chandrababu naidu on farm loans

(Image source from: kcr chandrababu naidu on farm loans )

రాజకీయరంగంలో వున్న నాయకులు ఏం మాట్లాడుతారో..? ఎలా మాట్లాడుతారో..? ఎటువంటి హామీలు ఇస్తారో..? ఏ హామీలను పూర్తి చేస్తారో..? వంటి విషయాలు అంతుపట్టని చిక్కు ప్రశ్నలుగానే మిగిలివుండిపోతాయి. అధికారం లేనప్పుడు ఒకరకంగా.. ఆ అధికారం లభించినప్పుడు మరొకరకంగా నాయకులు వ్యవహరించడం ప్రస్తుతం మన కళ్లముందు కనిపిస్తున్న ఒక కఠిన నిజం! సార్వత్రిక ఎన్నికలకు ముందు కేసీఆర్, బాబులు ప్రజలకు తమ ఇష్టారాజ్యంగా ఎన్నోరకాల హామీలు ప్రకటించారు. అధికారంలోకి వస్తే వాటిని ఖచ్చితంగా అమలు చేస్తామనే వాగ్ధానాలు కూడా చేశారు. కానీ ఇప్పటికీ వాటి ఫలితం కనిపించడం లేదు.

రెండురాష్ట్రాల్లో వున్న ముఖ్యమంత్రుల పార్టీలు అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు పూర్తికావస్తున్నప్పటికీ.. తామిచ్చిన కొన్ని కీలకమైన పథకాలను ఇంతవరకు అమలు చేయలేని పరిస్థితి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. రుణమాఫీ పథకం గురించి! ఎన్నికల సమయంలో రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయిస్తామంటూ బాగానే డప్పు వాయించుకున్నారు కానీ.. ఇప్పటికీ ఆ పథకం మాత్రం అమలు కాలేదు. రైతులందరూ వెయ్యికళ్లతో ఎదురుచూస్తూనే వున్నారు కానీ.. రెండు ప్రభుత్వాలు మాత్రం ఇంతవరకు రుణమాఫీ పథకంపై స్పష్టతనివ్వలేదు.

మరోవైపు కేంద్రసర్కార్ కూడా ఈ విషయంపై వెనకబడుగు వేస్తోంది. ఒకవేళ ఈ పథకాన్ని అమలు చేయాలంటే.. ఖజానాపై భారీ ప్రభావం చూపడమే కాకుండా.. దీర్ఘకాలికంగా సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం. అంత భారీ రేంజులో రెండురాష్ట్రాల్లో రుణాలు కూరుకుపోయి వున్నాయి. అందుకే.. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. మరి ఈ వ్యవహారంపై ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రంతో కలిసి ఒక తుదినిర్ణయానికి వస్తున్నారా అంటే.. అదీ లేదు! ఇంకా ఎప్పుడు రుణమాఫీలను అమలు చేస్తారంటూ తీవ్ర ఆగ్రహంతో రైతులందరూ గళం విప్పుతున్నారు కానీ.. ప్రభుత్వాల నుంచి ఏ సమాధానం మాత్రం దొరకడం లేదు. దీంతో ఇచ్చిన మాటలను నిలబెట్టుకునే దమ్ము కేసీఆర్, బాబులకు లేదా అంటూ రాజకీయ విశ్లేషకులతోపాటు సామాన్య ప్రజలు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

ఇదిలావుండగా.. ఈ ఇద్దరి సీఎంల వైఖరి రెండు అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్రంగా పడిందని సమాచారం! తమతమ సొంతనియోజకవర్గంలో కాలు పెట్టలేని దుస్థితిలోని వారందరూ వున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఊరికి వెళితే అక్కడ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తుంది. తీరా అక్కిడికి వెళితే.. రుణమాఫీపై అందరూ ప్రశ్నిస్తారు. అటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక తర్జనభర్జన పడుతున్నారు మంత్రులు. ఒకవేళ చెప్పేదాంట్లో ఏమైనా పొరపాటు దొర్లినా.. దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులతోపాటు తమ పార్టీల్లో వున్న మంత్రులకు ఇంతవరకు రుణమాఫీ పథకం ఎప్పుడు అమలు అవుతుందో అనే విషయం మీద స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో వున్న ప్రజలు మంత్రులను, ముఖ్యమంత్రులను హామీలను పూర్తి చేసే దమ్ము లేకున్నప్పుడు.. ఆ హామీలే ఎందుకు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మన చంద్రులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  chandrababu naidu  telugu states  farmers  loan weavers  

Other Articles