Telangana government targets another channel

telangana, telangana government, telangana cm, kcr, k. chandrashekar rao, metro rail, l and t metro rail, metro rail jobs, hyderabad, telangana news, latest news, hmr, ghmc, kcr on media, kcr comments, etv, etv telugu, etv channels, eenadu paper, telugu news papers, tv9, ban on tv9, abn, andhrajyothy

rumors that telangana government targetted another channel for publishing news on metro rail : mso's of telangana plans to stop telecasting etv and sub channels of that media organisation its just a rumor

ఇప్పుడు తెలంగాణ టార్గెట్ లో ఈ చానెల్..?

Posted: 09/18/2014 09:45 AM IST
Telangana government targets another channel

తెలంగాణ ప్రభుత్వం ఇంకో కొత్త చానెల్ ను టార్గెట్ చేసినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. మెట్రో రైలును తాము కట్టలేమంటూ ఎల్&టీ రాసిన లేఖను పత్రికలు ప్రచురించటంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఏదో లేఖ రాసినంతమాత్రాన ప్రధాన అంశంగా ప్రచురించి వివాదానికి కారణం అయ్యారని గుర్రుగా ఉంది సర్కారు. ఒక్క కధనంతో తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఉద్యమం సమయంలో వ్యవహరించిన తీరును కూడా దృష్టిలో ఉంచుకుందని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఆ పత్రిక సంబంధిత చానెల్ పై చర్యలకు ఉపక్రమిస్తుందని మాత్రం చెప్పలేము. కాని గత పరిణామాలను చూసిన విమర్శకులు ఏమైనా జరగవచ్చు కదా అని అనుకుంటున్నారు.

తెలంగాణ సమాజానికి, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే మీడియా అవసరంల లేదని వరంగల్ సభలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆత్మగౌరవానికి, తెలంగాణకు వ్యతిరేకంగా కధనాలను ప్రజలకు చెప్పే మీడియాను పదికిలోమీటర్ల లోతున పాతరేస్తామని హెచ్చరించారు కూడా. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి మీడియాను తొక్కేస్తామని బహిరంగంగా బెదిరించటం ఏంటని జాతీయ మీడియా ప్రశ్నించింది. ప్రెస్ కౌన్సిల్ విచారిస్తోంది. ఇంత జరిగినా తన మాటలపై ముఖ్య మంత్రి వెనక్కి తగ్గలేదు. క్షమాపణలు కోరలేదు. మీడియాపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏమిటో ఆయన అనుసరిస్తున్న విధానాల ద్వారా స్పష్టమవుతోంది.

ఇలాంటి సమయంలో.., ప్రముఖ తెలుగు దినపత్రికలు మెట్రో రైలు ప్రాజెక్టు ఆగిపోతుందనే అర్ధం వచ్చేలా కధనాలు ప్రచురించాయి. ఇది బుధవారం రోజు రాష్ర్టంలో రాజకీయ దుమారం రేపింది. తెలంగాణ స్వాతంత్ర్య దినం రోజుగా భావించే సెప్టెంబర్ 17న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కధనం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి.., హడావుడిగా చర్చలు జరిపి సాయంత్రానికి పరిస్థితిని చక్కబెట్టింది. ఎవరైతే ప్రాజెక్టు చేపట్టలేమని లేఖ రాశారో.,, వారి నోటితోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామని మీడియాకు ప్రకటించేలా చేసింది. ఇక ఇంత రచ్చకు కారణం అయిన మీడియాపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం కోపం కట్టలు తెంచుకుంది. గతంలో తెలంగాణ శాసనసభ్యులను విమర్శించేలా వ్యంగ్య కధనం ప్రసారం చేశారని ముఖ్యమంత్రి అంటే రెండు చానెళ్లు బంద్ అయి మూడు నెలలు దాటింది. ఇప్పుడీ కధనంపై మరోసారి కేసీఆర్ కన్నెర్ర జేస్తే ఈ చానెల్ పై కూడా ఎం.ఎస్.ఓ.లు నిషేదం ప్రకటిస్తారేమో అని విమర్శకులు చమత్కరించుకుంటున్నారు. అయితే ఇప్పటికే రెండు చానెళ్ల నిషేదం దేశ వ్యాప్తంగా విమర్శలకు దారితీయటంతో., అంత సాహసం మరోసారి చేసే ఉద్దేశ్యం వారికి లేదని తెలుస్తోంది. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లు.. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : metro rail  hyderabad  telugu news papers  telugu news channels  

Other Articles