Tamil telugu malayalam chennai media representatives protests against cm kcr

tv9 news channel, abn news channel, tamil media representatives, telugu media representatives, chennai journalist associations, cm kcr, media channels, telangana media channels, malayalam media representatives

tamil telugu malayalam chennai media representatives protests against cm kcr for not brodcasting tv9 and abn andhrajyothy news channels

కేసీఆర్ పై చెలరేగుతున్న మీడియా ఆగ్రహజ్వాలలు!

Posted: 09/22/2014 08:12 PM IST
Tamil telugu malayalam chennai media representatives protests against cm kcr

(Image source from: tamil telugu malayalam chennai media representatives protests against cm kcr)

తనతోపాటు శాసనసభ్యులను వ్యంగంగా సెటైర్లు వేయడంతోపాటు బహిరంగంగా తిట్లపురాణాన్ని వినిపించినందుకు సీఎం కేసీఆర్ టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాల మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే! అయితే మరుక్షణమే కేసీఆర్ తీరుపై స్పందించిన ఆయా ఛానెళ్ల యాజమాన్యం క్షమాపణలు చెప్పుకున్నప్పటికీ ఆయన కోపం చల్లారలేదు. దీంతో ఆయన ఆ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేశారు. తమ ఛానెళ్లను తిరిగి ప్రసారం చేయాల్సిందిగా ఆయా ఛానెళ్ల యాజమాన్యాలు ఎంత కోరుకున్నప్పటికీ వాటిని ప్రసారం చేయలేదు. దీంతో వారందరూ ప్లకార్డులు పట్టుకుని తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరసనలు వ్యక్తం చేశారు. ఇదే విషయమై ప్రత్యర్థ నాయకులు విమర్శించినప్పటికీ... తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. కానీ సదరు ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేసింది ఎమ్మెస్వోలని, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని ఇన్నాళ్లవరకు చెప్పుకుంటూ వచ్చారు.

అయితే కాళోజీ శతజయంతి సందర్భంగా కేసీఆర్ ఆ రెండు ఛానెళ్లమీద నిప్పులు చెరిగారు. ఇంతవరకు ఏ ఒక్క సీఎం చేయని విధంగా జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సంచలన వ్యాఖ్యలు చేసి ‘‘హిట్లర్ సీఎం’’గా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణలో వున్నప్పుడు తమ ప్రాంత నాయకులకు, ప్రజలకు మాత్రమే సలాం కొట్టాలని.. లేకపోతే పది అడుగుల వరకు పాతరేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో తీవ్రఆగ్రాహానికి గురైన జాతీయ మీడియా కూడా కేసీఆర్ పై నిప్పులు చెరిగింది. అటు అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ఆయా విషయాలపై మీద స్పందించకుండా తమ పని తాము చేసుకుంటూపోతున్నాయి. ఇంతవరకు ఆ ఛానెళ్ల ప్రసారాల పునరుద్ధరించే విషయంలో స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. దీంతో జర్నలిస్టులు మరోసారి ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయాలని బావిస్తున్నారు.

తాజాగా కేసీఆర్ కు వ్యతిరేకంగా చెన్నైలో కూడా వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సమాచారం! తమిళ, తెలుగు, మలయాళ మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు, జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ చెన్నై సభ్యులు ప్రెస్ క్లబ్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే చెన్నై ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి భారతీ తమిజాన్ మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని అన్నారు. తెలంగాణాలో ప్రైవేట్ ఛానెల్స్ ప్రసారాలపై ఆంక్షలు విధించడాన్ని ఆమె ఖండించారు. అటు ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రమంత్రి జవదేకర్ రంగంలోకి దిగినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమే మిగిలింది. ఆయన స్వయంగా తెలంగాణ ఎమ్మెస్వోలతోనూ, కేసీఆర్ తోనూ మాట్లాడినప్పటికీ.. వారు ఛానెళ్ల పునరుద్ధరణపై ఎలాంటి స్పష్టతనివ్వడం లేదు. మరి ఈ విషయం ఇంకెన్నాళ్లవరకు ఇలా కొనసాగుతుందో.. కేసీఆర్ తమ నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles