Tamilnadu cm jayalalitha assets case news

jayalalitha case, jayalalitha assets case, tamilnadu cm jayalalitha, tamilnadu amma news, tamilnadu state news, bangalore court, jayalalitha jailed, jayalalitha crime news, secrets behind jayalalitha case

tamilnadu cm jayalalitha assets case news : the reasons behind the jayalalitha case which delay this case maximum 18 years

18ఏళ్లపాటు ‘‘అమ్మ’’ విచారణకు కారణాలేంటి..?

Posted: 09/27/2014 08:50 PM IST
Tamilnadu cm jayalalitha assets case news

దాదాపు 18 ఏళ్లపాటు విచారణ కొనసాగిన అమ్మ అక్రమాస్తుల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! ఎప్పుడో 1996వ సంవత్సరంలో జయలలిత దగ్గర ఆదాయానికి మించి ఆస్తులు చాలా ఎక్కువగా వున్నాయంటూ ఆమెపై నమోదైన అక్రమాస్తుల కేసు... ఎన్నోసార్లు వాయిదాలు పడుతూ పడుతూ చివరికి ఒక కొలిక్కి వచ్చేసింది. కానీ ఈమె కేసు విషయంలో ఎందుకు ఇన్నాళ్ల సంవత్సరాలుపాటు విచారణ కొనసాగిందంటూ సందేహాలు వెలువడుతున్నాయి. అయితే ఈ కేసు ఇంత సుదీర్ఘంగా కొనసాగడానికి మొట్టమొదటి కారణంగా రాజకీయాలేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. రాజకీయాల్లో ఎప్పుడు, ఎలా జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. జయపై కేసు నమోదైన తర్వాత ఎన్నో అవాంతరాలు చోటు చేసుకున్న సందర్భంలో ఆనాడు జయ రాజకీయ ప్రత్యర్థి ఇందులో జోక్యం చేసుకోవడం వల్ల కేసు విచారణ ఆలస్యంగా జరిగిందని చెప్పుకోవడం ఎటువంటి సంశయమం లేదు.

ఎందుకంటే.. తమిళనాడులో కొనసాగుతున్న ఈ కేసుపై తమిళనాడులో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న సమయంలో డీఎంకే కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిందిగా కోరారు. దీంతో ఈ కేసులో ఒక్కసారిగా ప్రతిష్ఠంభన ఏర్పడింది. డీఎంకే వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. కేసు వేరే రాష్ట్రానికి మార్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఈ కేసును బెంగుళూరు కోర్టు మార్చడం జరిగింది. అయితే చెన్నై నుంచి బెంగుళూరుకు ఈ కేసును బదిలీ చేయడానికి ఏకంగా ఆరు సంవత్సరాల వరకు సమయం పట్టింది. ఈ దెబ్బతో కేసు విచారణలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ అక్రమాస్తుల కేసు చెన్నైలో కొనసాగుతున్నప్పుడు అప్పటికే 76 మంది సాక్షులను విచారించారు... క్రాస్ ఎగ్జామిన్ కూడా చేశారు. కానీ కేసు బెంగుళూరుకు మార్చిన తర్వాత సాక్షుల్లో కొంతమంది ఎదురు తిరిగారు. అధికారులే తమను బెదిరించి, తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిందిగా భయపెట్టారని వారందరు కోర్టుకు తెలిపారు. అంతే! కోర్టు కూడా అయోమయ పరిస్థితిలో పడిపోయింది.

ఆ సమయంలోనే కేసులోని నిందితులు కూడా ఒక్కసారిగా లెక్కలేనన్ని పిటిషన్లను దాఖలు చేస్తూ పోయారు. అటు సాక్షులు ఎదురు తిరిగడం, ఇటు లెక్కలేనన్ని పిటిషన్లు దాఖలు కావడంతో ఈ కేసు విచారణ కొనసా...గుతూనే పోయింది. ఇలా జరుగుతున్న సందర్భంలో చివరికి సుప్రీంకోర్టు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసి, సంచలనాలను సృష్టించింది. నిందితులతో ప్రాసిక్యూషన్ చేతులు కలిపిందని వ్యాఖ్యానాలు చేసిపారేసింది. దీంతో ఈ కామెంట్లు యావత్తు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ కేసు విచారణ సమయంలో కొంత గ్యాప్ పడింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 18ఏళ్లపాటు కొనసాగిన ఈ సుదీర్ఘ విచారణలో ప్రాసిక్యూషన్ ముందుకు జయ వచ్చింది కేవలం రెండుసార్లు మాత్రమే!

ఇంకా పూర్తి కాలేదు... ఈ కేసు విచారణ ఒకానొక సమయంలో ముగింపు దశకు వచ్చిందనుకున్న సమయంలో జయకు ఏకంగా 1339 ప్రశ్నలు సంధించారు. దాంతో ఆ ప్రశ్నోత్తరాల నేపథ్యంలోనే విచారణ కొంత సమయం కొనసాగింది. ఇలా ఎన్నో కారణాల మధ్య జయ అక్రమాస్తుల కేసు సాగుతూ సాగుతూ చివరికీ ఒక కొలిక్కి వచ్చేసింది. బెంగుళూరు ఆమెను దోషిగా నిర్ధారిస్తూ.. నాలుగేళ్ల జైలు శిక్ష, 100 కోట్ల వరకు జరిమానా విధించింది. అలాగే ఆరేళ్లపాటు ఆమె రాజకీయ జీవితంపై అనర్హత వేటును వేసేసింది. ఆమెతోపాటు ఈ కేసులో వున్న ఇతరులను కూడా బయటపడ్డారు. దీంతో ప్రస్తుతం తమిళనాడు మొత్తం ఉద్రిక్తిపరిస్థితుల మధ్య కొనసాగుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha assets case  tamilnadu state news  bangalore court  anna dmk  telugu news  

Other Articles