Parakala prabhakar recent comments

parakala prabhakar, parakala prabhakar wiki, parakala prabhakar latest, parakala prabhakar photos, parakala prabhakar comments on ysr congress, parakala prabhakar wife, parakala prabhakar niramala sitaraman, parakala prabhakar latest news, parakala prabhakar marriage, parakala prabhakar family, niramala sitaraman, niramala sitaraman profile, niramala sitaraman wiki, niramala sitaraman latest, niramala sitaraman marriage, niramala sitaraman profile, niramala sitaraman portfolio, latest news, andhrapradesh, tdp, telugu desam party

andhrapradesh government advisor parakala prabhakar comments creating sensation in ap politics : opposition party criticises parakala prabhakar and says he must be as a government representative and not behave as political leader

దూకుడు తగ్గకుంటే ఆగమైపోతావు

Posted: 09/29/2014 04:56 PM IST
Parakala prabhakar recent comments

మంచోడని దగ్గరకు తీసుకుంటే మంచమంతా ఏదో చేసినట్లుంది పరకాల ప్రభాకర్ తీరు. తెలివైన వ్యక్తి అని తెచ్చి దగ్గర పెట్టుకుంటే బాబు మీద ఈగవాలనివ్వటం లేదు బాగానే ఉంది. కాని ఇదే ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్ర్ర్తం అవుతోంది. ప్రభాకర్ ప్రభుత్వ ప్రతినిధా..? లేక రాజకీయ పార్టీ ప్రతినిధా? అని విమర్శలు వస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన కేబినెట్ స్థాయిలోని వ్యక్తి ఇలా ఒక పార్టీకి అనుకూలంగా బహిరంగంగా ప్రకటనలు చేయటం పట్ల ఏపీలో ప్రతిపక్షం మండిపడుతోంది. ఇంతకీ ప్రభాకర్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటే...?

మీడియాలో మంచి పట్టు ఉన్న పరకాల ప్రభాకర్ ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారుగా నియమితులయ్యారు. అంటే ఆయనకు ఎస్కార్టు. ప్రభుత్వ వాహనం.. ఇతర సౌకర్యాలు ఉంటాయన్నమాట. తెలంగాణ ఉద్యమం సమయంలో సమైక్య ఉద్యమానికి ఊతం ఇచ్చిన నేతల్లో ఈయనా ఒకరు. ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి కావటంతో.., ఆమె దగ్గర మెప్పు పొందేందుకు చంద్రబాబు పరకాలకు ఈ పదవి ఇచ్చారని అందరూ అనుకుంటున్నారు. తనకు పిలిచి పదవి కట్టబెట్టినందుకు బాబుకు అండగా నిలవాలని పరకాల కూడా మనస్సులో గట్టిగా అనుకున్నారు.

ఇక పోతే.., ఈ మద్య ఏపీ ప్రభుత్వం అక్రమార్కులంటూ ఏడు లక్షల వృద్ధాప్య పెన్షన్లను రద్దు చేసింది. దీనిపై వివాదం జరుగుతోంది. దీనిపై ప్రతిపక్షం కూడ విమర్శలు మొదలు పెట్టింది. బాబును ప్రతిపక్షం మాటలు అనటంతో తట్టుకోలేని పరకాల.., తాను ప్రభుత్వ ప్రతినిధి అనే విషయం మర్చిపోయి.. ఓ వైసీపీ నేత తండ్రికి (అతని పేరు ఏమిటో పరకాల బహిరంగంగా చెప్పారు) కూడా పెన్షన్ వస్తుంది ఆయన అనర్హుడు అయినా ఎలా పొందుతాడు? అని విషయాన్ని మరింత రాజకీయం చేశారు. ఇంకేముంది ప్రతిపక్షానికి మంచి అస్ర్తం దొరికింది. రాజకీయ కుట్రతోనే ఇదంతా జరుగుతుంది అని ఎదురుదాడి మొదలు పెట్టింది.

బాబుపై స్వామి భక్తి ఉంటే అది పనితీరులో చూపించాలి తప్ప... ప్రతిపక్షంపై విమర్శలు చేసి కాదు అని విశ్లేషకులు అంటున్నారు. కేబినెట్ హోదాలొ, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి కొత్తగా కొరివి పెడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్బంగా వారు ఒక ఊహాగానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. చంద్రబాబుకు ఎవరైనా కోపం తెప్పించినా.., ఇబ్బంది కల్గించినా టైం చూసి సారు దెబ్బ కొడతారు అని అంటున్నారు. మరి ప్రభుత్వానికి ప్రబాకర్ ఇప్పుడు ఇబ్బంది కల్గించారు. దీంతో ఆయన ఇబ్బందుల్లో పడ్డారన్నమాట. మరి సారు సంగతి ఏమవుతుందో చూడాలి. అయితే సీతారామన్ ఉన్నంతవరకు ప్రభాకర్ కు ఏమి కాదని ప్రచారం జరుగుతోంది. ఏదయితేనేం సలహాదారు దూకుడు తగ్గకుంటే ఆగమవటం మాత్రం ఖాయం. ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండి..., వివాదాలను కొనితెచ్చుకోకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parakala prabhakar  andhrapradesh  tdp  latest news  

Other Articles