Telangana government plans to reconduct survey in ghmc

ghmc, Comprehensive household survey, Greater population, reconduct, Telangana government

Telangana government plans to reconduct survey in GHMC

‘గ్రేటర్’లో మరో మారు సమగ్ర సర్వే!

Posted: 09/30/2014 01:50 PM IST
Telangana government plans to reconduct survey in ghmc

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేతో రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రజానికం ఎంత.?  కుటుంబాలు ఎన్ని.?  అన్న విషయాలతో పాటు ప్రభుత్వానికి కావాల్సిన సమాచారం వారికి అందింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం ఎంత మంది ప్రజలు వున్నారు..? కుటుంబాల సంఖ్య ఎంత అన్న విషయంలో ప్రభుత్వం వద్ద క్యారిటీ లేదని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో మరో పర్యాయం సమగ్ర కుటుంబ సర్వే జరిపించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం

గ్రేటర్ జనాభా కోటి దాటిందని ఓవైపు భావిస్తుండగా, సమగ్ర కుటుంబ సర్వే వివరాలు  కంప్యూటరీకరణ పూర్తయ్యాక వెల్లడైన వివరాల ప్రకారం  కోటికి చేరువలో కూడా లేమని తేలడంతోనే పలు సందేహాలకు తావిస్తోంది. ప్రభుత్వం సర్వే వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన తరువాత, ప్రభుత్వానికి వివరాలను అందించిన తరువాత కూడా తమ ఇళ్ల వద్దకు ఎన్యూమరేర్లు రాలేదని ప్రజలు పిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో మరోమారు సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

గ్రేటర్‌లోని ప్రజలకు కొత్త పథకాలు ప్రారంభించాలన్నా.. ఆశించిన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా సర్వే వివరాలే కీలకమని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి . ఈ నేపథ్యంలో నగరంలోని కుటుంబాలు ఎన్ని, జనాభా సంఖ్య ఎంత అనేది కచ్చితంగా తెలుసుకునేందుకు మరోమారు సర్వే అవసరమని ప్రభుత్వం బావిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 19న సర్వే ముగిశాక సైతం నగరంలో మిగిలిపోయిన కుటుంబాల వారి కోసం మరోమారు సర్వే చేపడతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని పలువురు ఆశగా ఎదురుచూస్తున్నారు. మిగిలిపోయిన వారి కోసం మరోమారు సర్వే జరుపుతామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ సైతం అన్నారని, ఈ నేపథ్యంలో సర్వే  తేదీ కోసం గ్రేటర్ వాసులు ఎదురు చూస్తున్నారు.

సర్వేరోజున మిగిలిపోయిన కుటుంబాలు అంతగా ఉండకపోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు మాత్రం తమ వివరాలు నమోదు కాలేదని చెబుతున్నారు. వీరి వివరాలు నమోదైతేనే గ్రేటర్ వాస్తవ జనాభా ఎంతో తెలిసే వీలుంది. హైదరాబాదులోనే నిత్యజీవనం సాగిస్తున్న వారినందరినీ పరిగణలోకి తీసకుంటే గత లెక్కలకు తాజా లెక్కలకు మధ్య  వ్యత్యాసానికి అవకాశం ఏర్పడింది. దీంతో సంక్షేమ పథకాలు, రాయితీలు వంటి వాటి లబ్ధి విషయంలో తేడా వచ్చే అవకాశం ఉందని ప్రజలు అందోళన చెందుతున్నారు.

ఈ కారణం చూపి వాస్తవ జనాభా లెక్కలు తేల్చక పోతే అసలుకే మోసం వచ్చే అవకాశమూ ఉందని మరి కొందరి వాదిస్తున్నారు. డబుల్ ఎంట్రీలకు ఏదో రకంగా చెక్ చెప్పొవచ్చుననీ..  అసలు గ్రేటర్‌లో ఉండే వారి సంఖ్య ఎంతన్నదితేల్చడం ముఖ్యమని అధికులు అభిప్రాయ పడుతున్నారు. మరి ప్రభుత్వం వీరిని కరుణిస్తుందో.. లేదో..? వేచి చూడాలి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles