Ys jagan afraid with jayalalitha case

jayalalitha, jayalalitha case, jayalalitha arrest, jayalalitha case judgement, jayalalitha latest, jayalalitha wiki, jayalalitha family, jayalalitha parti, aidmk, panneerselvam, jayalalitha political career, ys jagan, tamilnadu, dmk, politics, court, bangalore court, bangalore highcourt, jaganmohan reddy, jaganmohan reddy family, jaganmohan reddy wiki, jaganmohan reddy photos, jaganmohan reddy case, jaganmohan reddy latest, ysr congress, ys rajashekar reddy, cbi, nampally court, ap cbi, telugu news, andhrapradesh

ys jaganmohan reddy afraid with jayalalitha case and her imprisonment and fine : ysr congress chief jagan mohan reddy is looking into jayalalitha case and fears about his future

జయ కేసుతో జడుసుకుంటున్న జగన్

Posted: 09/29/2014 06:10 PM IST
Ys jagan afraid with jayalalitha case

పురుట్చితలైవి జయమ్మ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు చూసి వైసీపి అధినేతకు వణుకుపుడుతోందట. కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన జగన్ జడుసుకుంటున్నాడని సన్నిహితులు అంటున్నారు. జయలలిత కేసులో కోర్టు ఆమెకు 4సంవత్సరాల జైలు శిక్ష తో పాటు రూ. 100కోట్ల జరిమానా విధించింది. ప్రస్తుతం ఆమె పరప్పన జైలులో ఉండి కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అది వేరేవిషయం లెండి. ఇక ఈ కేసులో వచ్చిన తీర్పును చూసి మన మహా నేతల గుండెల్లో వణుకు పుడుతోందట. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న  కనిమెళి, రాజా, జగన్, గాలి జనార్ధన్ రెడ్డి ఇలా ప్రముఖులంతా ఈ తీర్పును చూసి తమ కేసు తీర్పు రోజును తలుచుకుని వణికిపోతున్నారట.

ముఖ్యంగా జగన్ విషయానికి వస్తే.., ఆయన చేసిన కుంభకోణంపై సీబీఐ ఘాటు వ్యాఖ్యలే చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో.. ‘ జగన్ తక్కువ సమయంలో నీతివంతంగా.., చట్టబద్దంగా ఇంత డబ్బు సంపాదించాడంటే మాత్రం ఆయన గురించి హార్వర్డ్ బిజినెస్ స్కూళ్లో పాఠాలు చెప్పాలి‘ అని సీబీఐ న్యాయవాది తీవ్రంగా వాదించారు. అంతేకాదు జగన్ అక్రమంగా డబ్బు సంపాదించారు. తండ్రి పేరు, పరపతి ఉపయోగించుకుని అక్రమ మార్గంలో కంపనీల్లోకి నిధులు రాబట్టారు అని సీబీఐ గట్టిగా వాదిస్తోంది. జగన్ తరపు న్యాయవాదులు కూడా అంతే సమర్దంగా వాదిస్తున్నారనుకోండి.

ఇప్పటికే జగన్ ఒక సారి జైలుకు వెళ్ళి వచ్చారు. కేసు విచారణ పూర్తయితే జయ మాదిరిగానే ఆయనకు కూడా మరోసారి జైలు జీవితం తప్పదని పార్టీ వర్గాలు, కిందిస్థాయి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. 66కోట్ల అక్రమాస్తులకే కోర్టు రూ. 100కోట్ల ఫైన్ వేస్తే.., వేల కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్ కు ఎంత జరిమానా విధిస్తారో అని ఆందోళన చెందుతున్నారు. ఇక పార్టీపై కూడా ఈ తీర్పు ప్రభావం పడుతోంది. అసలే జగన్ ఎవరి మాట వినకుండా ఒంటెద్దు పోకడ పోతాడని అంతా అనుకుంటుంటారు. జైళ్ళో ఉండగా పార్టీని నడిపిన తల్లి, చెల్లి ప్రస్తుతం ఈ విధానాల వల్లే దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు నేతల్లో కూడా అసంతృప్తులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ భయపడేదే నిజం అయితే..పార్టీ పరిస్థితి ఎలా అని అప్పుడే చర్చ మొదలైంది. ఎవరు నడిపిస్తారు.. వెంట ఎవరు నడుస్తారు అని అంతా అనుకుంటున్నారట.

ఇక అమ్మ కేసును చూసిన జగన్ బాబు.., అప్రమత్తమై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నాడట. తన కేసు ఏమిటి.. విచారణ ఇంకా ఎంతకాలం జరుగుతుంది. దీంతో పాటు శిక్ష పడితే ఎంతకాలం.., ఫైన్ ఎంత ఉంటుంది అనే అంశాలపై వివరణ తీసుకునేందుకు  న్యాయ నిపుణులను కలవాలని నిర్ణయించినట్లు సన్నిహితులు చెప్తున్నారు. దీన్ని రాజకీయ విశ్లేషకులు కూడా దృవీకరిస్తున్నారు. చూడాలి మరి జగన్ కేసులో ఏం జరుగుతుందో. జగన్నాటక చక్రధారి చివరకు ఏమవుతారో...?

(కేవలం ఊహాజనిత ప్రచారంతో ఈ కధనం రాయబడింది. ఖచ్చితమైన ఆధారాలు లేవు. కావున పాఠకులు స్పందించేముందు వాస్తవికతను దృవీకరించుకోవాలని మనవి)

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jaganmohan reddy  jayalalitha  cases  latest news  

Other Articles