Megastar chiranjeevi supports swachch bharat programme

chiranjeevi latest news, megastar chiranjeevi news, chiranjeevi swachch bharat, swachch bharat programme, narendra modi, aamir khan, kamal hassan, priyanka chopra, sachin tendulkar

megastar chiranjeevi supports swachch bharat programme

ఆ.. ప్రభావానికి లొంగిపోయిన చిరు..?

Posted: 10/11/2014 05:10 PM IST
Megastar chiranjeevi supports swachch bharat programme

రాజకీయపరంగా మెగాస్టార్ చిరంజీవికి ఎంత గట్టి దెబ్బ తగిలిందో అందరికీ తెలిసిన విషయమే! మొదట్లో ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన ఆయన... ఆనాడు వైఎస్ ప్రభావం వల్ల ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే కొన్నాళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ నియమాలు ఆయనకు బాగా నచ్చాయని పేర్కొంటూ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. తొలుత అక్కడ కూడా ఇబ్బందులను ఎదుర్కొన్న ఆయన.. చివరికి కేంద్రమంత్రి పదవిని పొందగలిగారు. కానీ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం కావడం వల్ల ఆయన ప్రస్తుతం ఆ పదవిని కోల్పోయి రాజ్యసభ సభ్యుడిగానే మిగిలిపోయారు. మొత్తంగా చెప్పదలచుకున్నదేమిటంటే... ఇంతవరకు చిరంజీవి రాజకీయ ప్రభావానికి పూర్తిగా లొంగిపోయారు. ఆ విషయాలను కాస్త పక్కనపెడితే... తాజా పరిణామాల నేపథ్యంలో చిరంజీవి మరోసారి ఆ.. ప్రభానికి లొంగిపోయారని తెలుస్తోంది. అయితే ఈసారి ఆయన లొంగిపోయిన ఆ ప్రభావం రాజకీయపరంగా కాదులెండి... మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఆయన తనవంతు మద్దతును ప్రకటించారు.

దేశపిత మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్రత భావతావనిని లక్ష్యంగా చేసుకుని.. ప్రధాని నరేంద్రమోడీ ‘‘స్వచ్ఛ భారత్’’ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే! ఈ కార్యక్రమంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు ఆయన భారత్ లో వివిధ విభాగాలకు చెందిన కొంతమంది ప్రముఖులను సవాలు చేశారు. అందులో భాగంగానే అమీర్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంకచోప్రా, సూర్య ఇంకా తదితర సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ మద్దతును ప్రకటించారు. అలాగే భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇలా ఒక్కొక్కరుగా తమవంతు కృషి చేస్తున్న ఈ జాబితాలోకి తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. ‘‘స్వచ్ఛ భారత్’’ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ఆయన ఒక వీడియో సందేశాన్ని తాజాగా విడుదల చేశారు. దీంతో చిరంజీవి కూడా త్వరలోనే ప్రజలముందుకు విచ్చేసి.. మోడీలాగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు చాలావరకు వున్నాయని తెలుస్తోంది.

చిరంజీవి విడుదల చేసిన వీడియోలో ఏమన్నారంటూ... ‘‘నమస్తే.. శుభ్రతగా ఉండడం దైవభక్తితో సమానం. నిరంతరం శుభ్రత పాటించకపోతే మనకు ఆ భగవంతుని ఆశీసులు లభించవని మహాత్మా గాంధీజీ చెప్పారు. శుభ్రతలేని నగరంలో స్వచ్చమైన మనుషులు జీవించలేరు. మన పరిసరాలను, గ్రామాలను, నగరాలను శుభ్రంగా ఉంచడం కోసం కృషి చేద్దాం. ఇది మనకు పెద్దగా ఖర్చు పని కాదు. గాంధీజీ స్ఫూర్తితో, గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోడి ‘స్వచ్ఛభారత్‌’కు పిలుపునిచ్చారు. రండి, మనందరం ఇందుకు మద్దతు తెలుపుదాం. జైహింద్’’ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించేశారు. దీంతో మోడీ ప్రవేశపెట్టిన ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రభావానికి చిరంజీవి కూడా లొంగిపోయారని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : chiranjeevi  swachch bharat programme  narendra modi  mahatma gandhi  sachin tendulkar  

Other Articles