Why did jagan appointed sharmila as telangana president now

Ys jagan, Ys sharmila, ysrcp, Ysr, party cadre, shoba nagireddy, allagadda, Telangana, President

why did jagan appointed sharmila as telangana president now..?

4 నెలలయ్యాక భజంత్రీలు వాయించిన జగన్..

Posted: 10/11/2014 04:36 PM IST
Why did jagan appointed sharmila as telangana president now

ఏదైనా మంచి పనిచేయాలంటే మంచి ముహుర్తాన్ని చూసుకుంటాం.. శుభముహూర్తం దాటిన నాలుగు నెలలకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాజాలు వాయించారు. సార్వత్రిక ఎన్నికలలతో పాటు జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలల కాలం తరువాత.. ఇప్పడు తెలంగాణలో తన పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇంతకీ ఎటూ కాని సమయంలో జగన్ తన సోదరిని తెలంగాణ తెరమీదకు ఎందుకు తీసుకోచ్చరని పలు సందేహాలు వస్తున్నాయి. గత ఎన్నికలలో సీమాంధ్రతో పాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిలను కేవలం తెలంగాణకే పరిమితం చేయడానికి గల కారణాలు ఏంటన్న ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి.

ఇటీవల జరిగిన ఎన్నికలలో కేవలం ప్రచారానికే పరిమితమైన షర్మిలను ఎన్నికల బరిలో నిలపకుండా చేసిన జగన్.. ఇప్పుడామెను ఎందుకు తెలంగాణకు పరిమితం చేశాడు..? ఎన్నికలలో తీవ్రంగా శ్రమించిన షర్మిల అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణలో పార్టీ గెలుపును భజస్కందాలపై వేసుకున్నారు. రాత్రనకా, పగలనకా.. అహర్నిషలు అన్న గెలుపుకోసం, ఆయన వదిలిన భాణం దూసుకెళ్లింది. రమారమి టీడీపీ కన్నా పదో పరకో అసెంబ్లీ స్థానాలు అధికంగా వస్తాయని, దీంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాలో వైసీపీ పార్టీ వుండింది. ఫలితాలు తారుమారు కావడం, టీడీపీ కన్నా తక్కువ స్థానాలు వైసీపీకి రావడంతో ప్రతిపక్ష పాత్ర వహిస్తూ.. ఇక రానున్న రోజుల్లో ముందుకెళ్లడం ఎలా.? పార్టీని బలోపేతం చేయడమెలా అని జగన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారట.

సీమాంధ్రలో అధికార టీడీపీ వైపు చూస్తున్న నేతలను నయానో, భయానో, బెదరించో, బుజ్జగించో నచ్చజెపుతూ పార్టీలోనే కొనసాగాలని కోరుతున్నారట. రానున్న రోజులు మనవే.. టీడీపీలోకి వెళ్లిన ఒక్కరిద్దరినీ చూసి మీరు వెళ్లకండి.. బాబు ఐదేళ్ల పాలిస్తే.. రాష్ట్ర ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసిన వైఎస్ పథకాలను మళ్లీ ప్రవేశపెట్టి ఇరవై ఏళ్లు.. ఆ పైనే మన పాలన వుంటుందంటూ.. పునరాలోచన చేసుకోవాలని కోరుతున్నారట. ఇక అదే సమయంలో ఇటు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసి, నాయకులను కట్టడి చేసేందుకు షర్మిలను రంగంలోకి దింపి.. అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన వైరా ఎమ్మెల్యే అధికార టీఆర్ఎస్ పార్టీలోకి దూకడంతో.. ఉన్న కొద్ది మందినైనా కాపాడునే యోచనలో జగన్ ఈ పనికి పూరుకున్నారట. అయితే ఈ పనేదో నాలుగు నెలల క్రితమే చేసివుంటే ఒక్కరు కూడా పార్టీ నుంచి వెళ్లేఃవారు కాదని అంటున్నాయి పార్టీ వర్గాలు.

ఇదిలావుంచితే.. పార్టీ అధికర ప్రతినిధిగా పనిచేసిన సర్గీయ నేత శోభానాగిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ నియోజకవర్గానికి వచ్చిన ఉప ఎన్నికలలో షర్మిల పోటీ చేయాలని భావించిందట. అయితే ఇక్కడ పోటీ చేస్తే పార్టీ నేతలకు తప్పడు సమచారం పంపించినవారమౌతామని జగన్.. షర్మిలకు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని కూడా ఓ రాజకీయవర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయ్.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ys jagan  Ys sharmila  ysrcp  Ysr  party cadre  shoba nagireddy  allagadda  Telangana  President  

Other Articles