Trs may join team modi

TRS may join Team Modi, Kesava Rao, Kavita to get Union jobs, ministry for kalwakuntla kavitha, ministry for k. ksehava rao, telangana rastra samithi, narendra modi, telangana, TRS to jon NDA government

Speculation was rife in political circles that the Telangana Rashtra Samiti would join the NDA government at the Centre, even as Chief Minister K. Chandrashekar Rao had a one-on-one meeting with Prime Minister Narendra Modi.

కమలంతో కారు జత, ఇద్దరికి మంత్రి పదవులు..?

Posted: 02/17/2015 12:01 PM IST
Trs may join team modi

ఆంధ్రప్రదేశ్తో వస్తున్న కలహాలు , దీనికి తోడు రాష్ట్ర పునర్విభజన బిల్లుకు సవరణలు చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో కమలానికి కారు చేరువవుతోంది. సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో అంటీ ముంటనట్లూగా ఉంటూ వస్తున్న టీఆర్ఎస్ ప్రస్తుతం కమళదళానికి స్నేహహస్తం అందించేందుకు సిద్దమవుతోంది. టిఆర్ఎస్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరవచ్చునని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ తతంగాన్ని హైదరాబాద్ గ్రెటర్ ఎన్నికలకు ముందుగానే ముగించుకోవాలని టీఆర్ఎస్ పావులు కదుపుతోందని సమాచారం..

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హస్తిన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతో ప్రత్యకంగా భేట కావడం ఇందుకు సంకేతతానలు ఇస్తోంది. తెలంగాణ పరిస్థితులను ప్రధాని ముందు ఏకరువు పెట్టడంతో ఆయన సానుకూలంగా స్పందించడం కూడా ఇందులో భాగంగానేని తెలుస్తోంది. అయితే కేంద్రంలో జతకట్టే క్రమంలో తన తనయ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత, పార్టీ సీనియర్ నేత సెక్రటరీ జనరల్ కేశవరావులకు కేంద్ర మంత్రి పదవులకు కూడా దక్కనున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

అయితే గత కొద్ది రోజులుగా ఇటువంటి ఊహాగానాలు చెలరేగుతున్నప్పటికీ కవిత గాని, ఇతర టిఆర్ఎస్ నాయకులు గానీ ఖండించకపోవడం గమనార్హం. ఇక కిందిస్థాయి నేతలను ఈ విషయమై ప్రశ్నించగా, దాటవేత దోరణిని ప్రదర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం కేంద్రంతో జతకడితే తప్ప బంగారు తెలంగాణ సాథ్యం కాదనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని వుండవచ్చునంటున్నారు. ఎన్డీయేలో చేరి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకుంటున్నామని గత కొద్ది రోజులుగా టీఆర్‌ఎస్‌ కూడా పరోక్ష ప్రచారం చేస్తోందని మీడియా కథనాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

జి.మనోహర్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NDA  TRs  kavitha  ksehava rao  narendra modi  

Other Articles