టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. టోటల్ ఇండియావైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న విషయం తెలిసిందే! అందుకే.. కొన్ని బాలీవుడ్ బ్రాండ్ లు కూడా ఇతని ఇమేజ్ ని క్యాచ్ చేసుకోవడం కోసం భారీ పారితోషికం ముట్టజెప్పి మరీ యాడ్స్ చేయించుకుంటున్నారు. అంతెందుకు.. హిందీలో డబ్ అయిన ఈ మూవీలు కూడా మాంచి రేటుకే అమ్ముడుపోతున్నాయి. పైగా.. సదరు ఛానెల్ టీఆర్పీ రేటింగ్స్ కూడా బాగానే వస్తాయి. ఇంతటి ఫాలోయింగ్ వుంది కాబట్టి.. తెలుగు ఇండస్ట్రీ స్టార్ హీరోల్లో ఒకడిగా చెలామణి అవుతున్నాడు.
ఇక మేటర్ లోకి వస్తే.. ఇటీవలే మహేష్ కి ఓ ప్రపోజల్ వచ్చింది. అదేమిటంటే.. తెలంగాణ ప్రభుత్వం మహేష్ ని హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని ఓ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ రేసులో నితిన్ కూడా వున్నాడు కానీ.. ప్రభుత్వం మాత్రం మహేష్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతోంది. మహేష్ ని హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తే నగరానికి ప్రపంచవ్యాప్తంగా మాంచి గుర్తింపు లభిస్తుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చిందని సమాచారం! ఇంతవరకు బాగానే వుంది కానీ.. మహేష్ ఈ ప్రపోజల్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? లేదా..? అన్నదే ఆసక్తికరంగా మారింది.
నిజానికి మహేష్ ఆంధ్రప్రాంతానికి చెందినవాడు. పైగా.. పొలిటికల్ విషయాలకు చాలా దూరంగా వుంటాడు. అటువంటి స్టార్ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ ని అంగీకరిస్తాడా..? లేదా..? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అంగీకరిస్తే.. ఇతను కూడా దాదాపు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లే! మరి.. ఆయన అభిప్రాయం ఎలా వుంటుందో తెలియదుగానీ.. సీఎం కేసీఆర్ - కృష్ణల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు వున్నాయి కాబట్టి.. ప్రిన్స్ ఈ ప్రపోజల్ ని ఒప్పుకునే ఛాన్సెస్ చాలావరకు వున్నాయని సినీ, రాజకీయ విశ్లేషకులు తమ మనసులోని భావాలను వ్యక్తపరుస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఆ మధ్య కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆ నేపథ్యంలో కేసీఆర్ కూడా ఆయనపై తనదైన శైలిలో ప్రశంసలు చేశారు. కాలక్రమంలో వీరి సాన్నిహిత్యం మరింతగా పెరుగుతున్న కారణంగా మహేష్ ‘బ్రాండ్’గా మారే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more