ys jagan | lokesh | cm | ap

Nara lokesh and ys jagan have that differences between them

ys jagan, lokesh, cm, ap, chandrababu, ys rajshekar reddy

Nara lokesh and ys jagan have that differences between them. Nara lokesh son of chandrababu and ys jagan son of ys rajshekar reddy have some major differences.

జగన్, లోకేష్ లకు తేడా అదేనా..?

Posted: 05/16/2015 03:33 PM IST
Nara lokesh and ys jagan have that differences between them

వారిలో ఒకరు అప్పటి ముఖ్యమంత్రి కొడుకు. మరొకరు ఇప్పటి సీఎం కుమారుడు. ఇద్దరిదీ పార్టీల్లో కీ రోలే. వారే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడి కొడుకు నారా లోకేష్. ఓ విషయంలో ఆ ఇద్దరికీ చాలా తేడానే ఉంది. ఇప్పుడా తేడా గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. నారా లోకేష్ అమెరికా టూరే కారణం. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ ఎప్పుడూ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు, బెంగళూరు లోనే ఉండేవాడు. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చేవాడు, అలా వచ్చినప్పుడే కావాల్సిన పనులు చక్కబెట్టుకుని వెళ్ళేవాడట. లోకేష్ మాత్రం హైదరాబాద్ లోనే ఉంటూ, టిడిపి లో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. కార్యకర్తలతో కలిసిపోతున్నాడు.

ఇక ఇపుడు జగన్ ఎదుర్కొంటున్న అవినీతి కేసులన్నీ పెట్టుబడులకు సంబంధించినవే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన కంపెనీలలోకి పెట్టుబడులు ఆకర్షించాడన్నది జగన్ పై కేసు. అయితే లోకేష్ మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకోసమే అమెరికాలో టూర్ చేస్తున్నాడు. అక్కడ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతూ వారిని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి లోకేష్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు పెట్టుబడులు రాలుస్తోంది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం జగన్ కన్నా లోకేష్ బెటర్ అని ఒప్పుకోవాల్సిందే అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  lokesh  cm  ap  chandrababu  ys rajshekar reddy  

Other Articles