తర్వలోనే తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించనున్నారు. అయితే ఈసందర్భంగా ఆసక్తికరమైన చర్చ సైతం చోటుచేసుకుంటోంది. పార్టీ అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ జాతీయ నేతగా వెళతారా ? లేక రాష్ట్రానికే పరిమితమవుతారా ? అనే సందేహాలు ఇంకా వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పాలన సాగుతున్న నేపథ్యంలో పార్టీ జాతీయ బాధ్యతలు చేపడితేనే బాగుంటుందనే అభిప్రాయాలు రెండు రాష్ట్రాల్లోని కీలక నేతల నుంచి వస్తున్నాయి. తెలంగాణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు మరో నాయకుడికి అప్పగిస్తారనే ప్రచారం ఆపార్టీలో జరుగుతోంది. అలాజరగకపోతే తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే కూడా అయిన బాలకృష్ణను ఈ మహానాడు సందర్భంగా క్రీయాశీల రాజకీయాల్లోకి తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ముఖ్యమంత్రిగా తీరికలేకుండా ఉంటున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర బాధ్యతలు మరొకరికి అప్పగించే అవకాశాలు సైతం ఉన్నాయని చెబుతున్నారు. పార్టీని ఇతర రాష్ట్రాలకు సైతం విస్తరించి బలం పెంచుకోవాలని, తద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు జాతీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో జరుగుతున్న ఈ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దేశం యావత్తూ గండిపేట వైపు చూసేలా ఏర్పాట్లు చేయాలని బాబు ఆదేశించినట్లు సమాచారం. పార్టీని జాతీయస్థాయికి మలచడం ద్వారా కేంద్రంపై పట్టుసాధించే అవకాశాలు సైతం లేకపోలేదని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. ఇదిలావుండగా తెలంగాణలో పార్టీ మనుగడ పెద్దసవాల్‌గా మారింది. టిఆర్ఎస్ ప్రభుత్వం, టిటిడిపికి చెందిన ఎమ్మెల్యేలను లాక్కుంటున్న నేపథ్యంలో ఈమహానాడులో దానిపై తీవ్రంగా చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంతేగాక మహానాడులో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారా ? లేక ప్రస్తుత అధ్యక్షులు ఎల్.రమణనే కొనసాగిస్తారా అనే చర్చ సైతం జరుగుతోంది. తాజా పరిస్థితుల్లో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని పెట్టి తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవాలనే భావనలో సైతం చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. అలాగే రమణకు ఎమ్మెల్సీని పదవిని ఇచ్చి, ఆయన్ను జాతీయ పార్టీ కార్యవర్గంలో నియమిస్తారనే మరోరకమైన ప్రచారం కూడా జరుగుతోంది. ఇకపోతే అధ్యక్ష పదవి కోసం ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి తదితరులు పోటీపడుతున్నారు. అయితే చంద్రబాబు యధాతథ స్థితని కొనసాగించకపోతే, దళితులను సైతం ముందుకు తెస్తారని అంటున్నారు. ఇదే గనక నిజమైతే ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, జి.సాయన్న, మరోనేత మోత్కుపల్లి నర్సింహులు తదితరుల పేర్లను పరిశీలిస్తారనే ప్రచారం ఇటు టిడిఎల్పీ, అటు ఎన్టీఆర్ భవన్లో జరుగుతోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more