police given full authority by Tdp at mahanadu

Insult to tdp party mlas and senior leaders at mahanadu

chandrababu naidu, mahanadu programme, tdp party updates, chandrababu naidu controversies, elections promises, chandrababu elections promises, ap capital city news, ap capital donations, ap capital updates, ap capital amaravati plan, tdp mahanadu, mahanadu 2015, NTR, balakrishna, pavan Kalyan, power star pavan kalyan, PK, nara lokesh, hari krishna, Jr NTR, party MLAs, party senior leaders

police given full authority for mahanadu arraingements, which caused insult to party mlas and senior leaders

అందుకనే పోలీసులకు మహానాడు బాధ్యతలా..?

Posted: 05/28/2015 06:41 PM IST
Insult to tdp party mlas and senior leaders at mahanadu

ఆంధ్రుల ఆరాధ్య దైవంగా, చరిత్రలో తనకంటూ ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్న మహావ్యక్తి.. స్వర్గీయ నందమూరి తారకరామారావు. తెలుగు ప్రజల ఆత్మాభిమానం ఢిల్లీ వీధుల్లో మోకరిల్లుతుందని స్థాపించిన తెలుగు వారి ఆత్మాభిమాన పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీలో కార్యకర్తల నుంచి అధినేత వరకు అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని.. ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. పార్టీని ప్రజల్లోకి కూడా అంతే వేగంగా తీసుకెళ్లేందుకు ఎన్టీరామారావు మహానాడు పేరుతో కార్యక్రమాన్ని రూపోందించారు. అన్నగారి తరువాత పార్టీ అధినేతగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు మధ్యలో పలు సందర్భాలలో మహానాడుకు తిలోదాలు ఇచ్చినా.. రాష్ట్ర పునర్విభజన తరువాత, అదికాకుండా అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న మహానాడులో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సొంత పార్టీ నేతలకు అవమానాలు అధికమయ్యాయి.

తెలుగుదేశం పార్టీ వాలెంటీర్లతో ప్రతీ పర్యాయం నిర్వహించే మహానాడుకు ఈ సారి ఎందుకని పోలీసులకు అధికారం ఇచ్చారన్న ప్రజలకు టీడీపీ నేతలే సమాధానం చెప్పాలి. స్వయంగా పార్టీ వ్యవస్తాపకుడు ఎన్టీయార్ వారసుడు, సినీ నటుడు బాలయ్యబాబుకే పరాభవం జరిగింది. సినిమాలలో డైనమిక్ పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వహించి.. పోలీస్ అంటే ఇలా వుండాలనిపించేలా పలు పాత్రలు చేసి వారి.. ఖ్యాతిని పెంచిన బాలయ్యబాబుకు.. వారి వల్లే పరాభవం ఎదురైంది. మహానాడుకు ఆయనను ప్రధాన ద్వారం గుండా లోనికి అనుమతించలేదు పోలీసులు. తమకు ఆ మేరకు అదేశాలు వున్నాయంటూ.. అందుకనే తాము ఎవరినీ అనుమతించలేమని చెప్పడంతో.. బాలయ్యబాబు కూడా అక్కడ రాజకీయ నేతలాగే వ్యవహరించారు.

police-given-authority-4

సీఎం వాహనానికి తప్ప మిగతా వాహనాలకు అనుమతి ఇవ్వరాదని తమకు ఆదేశాలు ఉన్నాయని వాటి ప్రకారమే నడుచుకుంటున్నామని స్పష్టం చేసిన పోలీసులపై బాలకృష్ణ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రధాన ద్వారం నుంచే వెళతానని పట్టుపట్టారు. మీకు అదేశాలు ఇచ్చింది ఎవరు’ అంటూ పోలీసులను ప్రశ్నించారు. పోలీసులపై పరుష పదజాలంలో విరుచుకుపడ్డారు. సినిమాల్లో పోలీసు కాదు.. నిజ జీవితంలో ప్రజా ప్రతినిధిని అంటూ వారిపై విరచుకుపడ్డారు. ఇంతలో ఇతర పోలీసుల అధికారులు వచ్చిన బాలయ్యను సముదాయించి వేరే గేట్ నుంచి ఆయనను లోపలికి పంపించారు. ఆయనకే కాదు పలువురు సీనియర్‌ నేతల విషయంలోనూ ఇలాగే జరిగింది. పోలీసులు అతిగా వ్యవహరించడంతో పలువురు నాయకులు ఇబ్బందులకు గురయ్యారు. మేము ఎమ్మెల్యేలం బాబు అని ఐడీ కార్డులు చూపించాల్సిన పరిస్థతి గౌతు శివాజీ, అశోక్‌లకు వచ్చింది. అయినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు ఎంపీ శివప్రసాద్ వారిని లోపలికి తీసుకోచ్చారు.

police-given-authority-1

మెదక్‌జిల్లా నేతలు పోలీసుల వైఖరిపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సమయంలో వారు పోలీసులతో కలబడేయత్నం చేశారు. పోలీసులు అతి ప్రవర్తన పట్ల మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సైతం అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యకు తోడు.. లోపల సీట్ల ఏర్పాటు కూడా అస్తవ్యస్తంగా ఉంది. గతంలో ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మీడియా, మహిళలు ఇలా వేరు వేరుగా బ్లాక్‌లు ఏర్పాటు చేసే వారు. కానీ ఈసారి ఎవరు ఎక్కడో తెలియని పరిస్థితి నెలకొంది.

police-given-authority-3

పార్టీ వాలెంటీర్లకు కాకుండా ఎందుకిలా పోలీసులకు నిర్వహణా బాద్యతలు ఇచ్చారన్న సందేహాలు కూడా పార్టీ నేతల్లో తలెత్తాయి. అయితే ధీనికి కారణం లేకపోలేదని కూడా తెలుగుతమ్ముళ్లు అంటున్నారు. ప్రస్తతం మహానాడు జరుగుతున్న నియోజకవర్గం చేవళ్ల పరిధిలోకి వస్తుంది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి గెలుపోందిన యాదయ్య అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ తరువాత పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకన్నారు. అంతేకాదు.. హిమాయత్ నగర్ (మహానాడు నిర్వహించే గ్రామం) లో కూడా స్థానిక సంఘాలు, సర్పంచ్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వారెక్కడ మహానాడుకు అవరోధాలు తీసుకువస్తారోనని భావించిన తెలుగుదేశం పార్టీ పెద్దలు పోలీసులకు మహానాడు కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను ఇచ్చారట. అందుకే పార్టీ నేతలు అవమానాలు పడాల్సివచ్చిందని తెలుగుతమ్ముళ్లే గుసగుసలాడుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  mahanadu  election promises  

Other Articles