bjp ignores cash for vote controversy case

Bjp distances itself from cash for vote issue

bjp distances itself from cash for vote issue, bjp ignores cash for vote controversy case, bjp, union government, ignores, cashfor vote controversy case, chandrababu, chandrashekar Rao, KCR, Telangana government, Revanth reddy, Telangana TDP, Harikrishna, ntr legacy, note fot vote case, bribery case, Telangana mlc elections, stephen, nominated mla stephen, ACB, anti corruption bureau, AK Khan, KTR, nara lokesh, pavan kalyan, jr ntr, Ap government, ap cm chandrababu, ysrcp, ys jagan

bjp and central government ignores cash for vote controversy case in Telangana

ముడుపుల కేసు నుంచి బీజేపి దూరం

Posted: 06/08/2015 03:45 PM IST
Bjp distances itself from cash for vote issue

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని నోట్లతో కోట్ల రూపాయల ప్రలోభాలకు గురిచేసి.. టీఆర్ఎస్ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో జరిపిన ఫోన్ సంభాషణల జరిపిన ఎపిసోడ్ పై బీజేపి దూరం జరుగుతోంది. ఈ వ్యవహారం ఆసాంతం కేవలం చంద్రబాబు నాయుడుకి.. ఆయన పార్టీకి చెందిన నేతలకు సంబంధించిన విషయంగానే చూస్తూ.. ప్రస్తుతం ఈ విషయంలో ఎలాంటి జోక్యం కల్పించుకోవద్దని యోచిస్తున్నట్లు సమాచారం. ఒక తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుంటూ అవినీతి మరక అంటించుకున్న చంద్రబాబుపై మరో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలను గమనించిన ఫిమ్మట స్పందించాలని భావిస్తోంది.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుకున్న మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకు టీడీపీ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలో పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించలేదు. అసలు తనకు ఈ విషయం గురించి తెలియదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్టీఫెన్ తో జరిపిన ఫోన్ సంభాషణ టేపులు బయటకు రావడంతో.. ఇక మరిన్న రోజులు ఆయన హస్తినకే పరిమితం కానున్నారని సమాచారం. ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో విఫక్షాలతో పాటు మీడియా అయనను ప్రశ్నిస్తున్న తరుణంలో.. దాటవేత దోరణిని అవలంబిస్తున్న వెంకయ్యనాయుడు.. ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ ల అంశంపై దూరం జరగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp  union government  ignores  cashfor vote controversy case  

Other Articles