Tdp leaders giving illogical explanations on tapes issue

Tdp takes new route to deviate tapes issue

TDP takes new route to deviate tapes issue, TDP leaders, illogical explanations, cashfor vote controversy case, chandrababu, chandrashekar Rao, KCR, Telangana government, Revanth reddy, Telangana TDP, Harikrishna, ntr legacy, note fot vote case, bribery case, Telangana mlc elections, stephen, nominated mla stephen, ACB, anti corruption bureau, AK Khan, KTR, nara lokesh, pavan kalyan, jr ntr, Ap government, ap cm chandrababu, ysrcp, ys jagan,

TDP takes new route to deviate tapes issue as leaders of the party giving illogical explanations on the issue

టీడీపీ నేతల అర్థరహిత వాదనలు..!

Posted: 06/08/2015 03:55 PM IST
Tdp takes new route to deviate tapes issue

తెలుగుదేశం పార్టీ నేతలు వితండవాదులు, పిడివాదులుగా బాగా రాణిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనంగా మారిన టేపుల వ్యవహారంలో.. అసలు విషయాన్ని పక్కన బెట్టి.. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరించడంపై రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విమర్శల వినబడుతున్నాయి. ఓటుకు నోటు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా ఏసీబి అధికారులకు బుక్ అయ్యిన తరువాత.. ఆయనపై కుట్ర జరిగిందని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టుతున్న నేపథ్యంలోనే ఆయనపై కేసులు నమోదవుతున్నాయని.. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రగా పేర్కోన్నారు.

ఇక మరికోందరు సీనియర్ నాయకులు ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ప్రాణ హాని వుందని, ఏకంగా డీజీపీ అనురాగ్ శర్మను కలసి మరీ తమ అవేదనను వ్యక్తం చేశారు. నిందితుడిగా రెడ్ హ్యాండెండ్ గా దొరికిన రేవంత్ రెడ్డి కూడా ఎలాంటి సాక్ష్యాలు లేవని భావించి ఏకంగా మీసాలు మేలయడం, తోడలు కోట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అంతేకాదు మీడియాపై కూడా చిర్రుబుర్రులాడారు. అ తరువాత రేవంత్ ఎలా దొరికింది. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ తో ఎలాంటి సంబాషణలు చేసింది.? అంతా టేపుల రూపంలో సాక్షాలు వెలుగు చూశాక ఇక చేసిది లేక మిన్నకున్నారు.

అయితే టీడీపీ నేతలు మాత్రం ఇంకా రేవంత్ రెడ్డికి ప్రాణ హానీ వుందంటూ.. ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ విషయంలో టీడీపీ అధినేత, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే స్టీఫెన్ తో జరిపిన సంబాషణ టేపులు కూడా తమ వద్ద వున్నాయని స్వయంగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖా మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించడంతో సంచలనమైంది. అయితే అ టేపులను సరిగ్గా రేవంత్ రెడ్డి అరెస్టు అయిన వారం రోజుల వ్యవధి తరువాత బయటకువచ్చాయి. స్టీఫెన్ అభిమతాన్ని తమ వాళ్లు తనకు వివరించారని, మీరు ధైర్యంగా ఓటేయాలని ఏం జరిగినా తాము చూసుకుంటామని, చంద్రబాబు స్టీఫెన్ తో ఫోన్ సంభాషణలో బయటపడింది. అయితే అ టేపులు నిజంగా ఆయనవేనా...? కావా...? అన్నది మాత్రం తెలియాల్సి వుంది.

ఈ నేపథ్యంలో తెరమీదకు వచ్చిన టీడీపీ నేతలు.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వున్నంత మాత్రాన తమ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ సంబాషణలను ట్యాఫింగ్ చేశారని ఇది చట్టవిరుద్దమని, ఇలాంటి చర్యలు చేపట్టాలంటే కేంద్రం అనుమతి తప్పని సరని వాదిస్తున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరికోందరు తెలంగాణ నేతలు వాదన మరోలా వుంది. చంద్రబాబు.. ఎమ్మెల్యేతో మాట్లాడిన ఫోన్ సంబాషణ టేపులు ఇంత ఆలస్యంగా ఎందుకు విడుదల చేశారు..? అసలు విడుదల చేసింది ఎవరు..?  ఆ టేపులు ఎలా బయటకు వచ్చాయి..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకోదరు నేతలైతే.. తమ అధినేత ఎక్కడెక్కడో, ఎప్పుడెప్పుడో మాట్లాడిన మాటలన్నింటినీ క్రోడీకరించి.. తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అరోపిస్తున్నారు. ఏది నిజమో..? ఏది అబద్దమో...? ఏది సత్యం, ఏది అసత్యం..? అన్న విషయాలు మాత్రం వారి వారి మనసాక్షికి తెలియకుండా పోతాయా..? అంటున్నారు ప్రజలు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash for vote issue  TDP leaders  illogical explanations  

Other Articles