marri shashidhar reddy targets governer narasimhan | jaipal reddy | revanth reddy | cash for vote

Marri shashidhar reddy targets governer narasimhan

marri shashidhar reddy, governer, Talasani srinivas yadav, ministry, jaipal Reddy, speaker madhusudhana chary, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, mutaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy

congress senior leader and ndma vormer vice president marri shashidhar reddy targets governer narasimhan

గురువాజ్ఞ మేరకే మర్రి.. టార్గెట్ గవర్నర్..?

Posted: 06/16/2015 06:54 PM IST
Marri shashidhar reddy targets governer narasimhan

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి భయటపడేందుకు కాంగ్రెస్ పెద్దలు కూడా సహకరిస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినవస్తున్నాయి. ఈ కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా.. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 50 లక్షల రూపాయలు ఇస్తూ ఏసిబికి పట్టబడినా.. కడిగిన ముత్యంలా తనను బయటకు తీసుకోచ్చేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే తమ ప్రయత్నాలు బెడిసి కోట్టడంతో.. సో కాల్డ్ కాంగ్రెస్ నేతలు కూడా గవర్నర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలను గుప్పిస్తున్నారు.

ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధారిటీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ స్పీకర్ మధుసూధనా చారికి లేఖ రాయడం కూడా చర్చనీయాంశంగా మారింది. గతానికి భిన్నంగా మర్రి శశిధర్ రెడ్డి ఏకంగా స్పీకర్ సహా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను టార్గెట్ చేస్తూ పలు అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే తాన ఇటీవల ఓటమి పాలైన నియోజకవర్గం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపోందడంపై ఆయన ఈ లేఖ రాశారా..? లేక గురువర్యుల ఆజ్ఞ మేరకు లేఖ రాశారా..? అన్న అంశమై పలు పార్టీలకు చెందిన నేతల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

మర్రి శశిధర్ రెడ్డి స్పీకర్ కు రాసిన లేఖలో.. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేశారా...? లేదా అన్న విషయాన్ని స్పీకర్ తక్షణం స్పష్టం చేయాలన్నారు. రాజీనామా చేసి వుంటే.. ఇంకా దానిపై స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి అని తెలిసి కూడా అతడి చేత గవర్నర్ నరసింహన్ మంత్రిగా ఎలా ప్రమాణస్వీకారం చేయించారని ఆయన ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్దం కాదా..? అంటూ నిలదీశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించలేనప్పుడు గవర్నర్ స్థానంలో నరసింహన్ కోనసాగడం మంచింది కాదని కూడా హితవు పలికారు.

ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే అసలు అనుమానాలు తలెత్తుతున్నాయి. తన గురువర్యులాంటి వారైన మాజీ కేంద్ర మంత్రి వర్యులు జైపాల్ రెడ్డి సూచనల మేరకు మర్రి శశిధర్ రెడ్డి.. స్పీకర్ సహా గవర్నర్ లను టార్గెట్ చేశారన్న పుకార్లు సైతం వినబడుతున్నాయి. జైపాల్ రెడ్డి మర్రి శశిధర్ రెడ్డికి గురువర్యులెలా అయ్యారన్న విషయాన్ని పక్కన బెడితే.. గత యూపీఏ పదేళ్ల హయాంలో.. మర్రి శశిధర్ రెడ్డికి ముందుగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధారిటీ సభ్యుడిగా, ఆ తరువాత ుఫాధ్యక్షుడిగా బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం అప్పగించడంలో జైపాల్ రెడ్డి కీలక మంత్రాంగం నడిపిన విషయం తెలిసిందే. దీంతో తన సోదరుడి తనయ భర్త.. రమారమి తనకు అల్లుడైన రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్న జైపాల్ రెడ్డి పనిలో పనిగా తన పేరు బయటకు రాకుండా మర్రి శశిధర్ రెడ్డితో ఇలా విమర్శలు గుప్పించారని అనుమానాలు వినబడుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : marri shashidhar reddy  governer  Talasani srinivas yadav  ministry  jaipal Reddy  

Other Articles