PM interference in Lalit Modi visa controversy | sushma swaraj | External Affairs | UK | portugal

Pm interference in lalit modi visa controversy

PM interference in Lalit Modi visa controversy, Randeep Surjewala, UK government, Sushma Swaraj, Lalit Modi, Keith Vaz, External Affairs Minister, Delhi High Court, Digvijay singh, Congress party Leader, sushma swaraj, UK's top immigration official, British travel papers to Lalit Modi, British High Commissioner, humanitarian view, Indo-UK relations,

opposition party congress alleges that Prime minister narendra modi's interference made lalit modi to get portugal visa, They also alleges that lalit modi has good contacts with national bjp president amit shah

మోడీకి వీసా వెనుకు ప్రధాని ప్రమేయం..?

Posted: 06/16/2015 06:58 PM IST
Pm interference in lalit modi visa controversy

ఐపిఎల్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఐపీఎల్ మాజీ చైర్మన్, నిధుల దుర్వినియోగం కేసులో అభియోగాలు ఎదుర్కోంటూ లండన్ లో తలదాచుకున్న లలిత్ మోడీకి ఫోర్చుగల్ వీసా కల్పించే విషయంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రమేయముందన్న వార్తలు పార్లమెంటు పరిసరాల్లో షికార్లు కోడుతున్నాయి. సుష్మాస్వరాజ్ పై మోడీ ఒత్తడి తీసుకువచ్చి.. చట్టవిరుద్దమైన చర్యలకు అమె పాల్పడేలా చేశాడని విమర్శలు వినబడుతున్నాయి. లలిత్ మోడీకి లండన్ నుంచి పోర్చుగల్ వేళ్లుందుకు అనుమతించాలని సిఫార్సు చేస్తూ సుష్మస్వరాజ్ యుకే ప్రభుత్వానికి, అక్కడి హై కమీషనర్ కు లేఖ రాయడం వెనుకు మోడీ ప్రమేయం వుందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది.

ఈ విషయం జూన్ 14న వెలుగులోకి రావడంతో అమెను సంజాయిషీ కోరిన ప్రధాని అమె తప్పుచేయలేదని భావించి.. అదేమి అంత పెద్ద తప్పుగా పరిగణించలేమన్నట్లు వ్యవహరించడంపై కాంగ్రెస్ మండిపడింది. అంతే కాదు అ తరువాత కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం సుష్మస్వరాజ్ చేసినదాంట్లో తప్పేముందని ప్రశ్నించడంపై కూడా విపక్షాలు మండిపడుతున్నాయి. అభ్యర్థిస్తే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సహాయం చేస్తారా అని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. అప్పుడు కూడా కేంద్రమంత్రి చర్యలను ప్రధాని సమర్థిస్తారా..? అంటూ నిలదీసింది.

వాంటెడ్ జాబితాలో ఉన్న నిందితుడు, రెడ్ కార్నర్ నోటీసులు అందుకున్న లలిత్ మోడీకి మానవతా దృక్పథంతోనే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సాయం చేశారని బీజేపీ వెనకేసుకురావడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. మోడీకి మోదీ సాయం చేస్తున్నట్టుగా కనబడుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుజ్రీవాలా ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు లలిత్ మోడీ సన్నిహితుడన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. పలువురు బీజేపీ నాయకులతోనూ లలిత్ కు సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఇటీవలే గుజరాత్ లో రూ.1000 కోట్ల అక్రమ బెట్టింగ్ రాకెట్ వెలుగు చూసిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు.

మానవతా కోణంలో లలిత్ మోడీకి సహాయం చేశామని బీజేపీ సమర్థించుకోవడాన్ని తప్పుపట్టారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు దేశం విడిచి పారిపోయేందుకు సహకరించడమే మోదీ ప్రభుత్వ విధానం అన్నట్టుగా కమలనాథులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తులకు ప్రపంచవ్యాప్తంగా పర్యటించేందుకు వీసాలు మంజూరు చేయడం మోడీ ప్రభుత్వ ప్రధాన అజెండాలా కనబడుతోందని విమర్శించారు. ఇది చాలదన్నట్లు ప్రధాని మోడీ దేశవిదేశాల పర్యటనలో ఇప్పడు దేశస్థులు గర్విస్తున్నారంటూ ప్రచారం చేసుకోవడం.. బీజేపికే చెల్లుతుందని మండిపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Randeep Surjewala  sushma swaraj  congress  lalit modi  red corner notice  

Other Articles