తెలుగు ప్రజల ఆత్మాభిమానం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టబడి వుందని, తెలుగు జాతికి ఆత్మాభిమానం తీసుకురావాలని, తెలుగువారి ఔనత్యం, తెలుగువారి గోప్పదనం ప్రపంచ నలుమూలలా తెలియాలని, పార్టీని స్థాపించిన తొమ్మిది మాసాల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన మహనీయుడు, తెలుగు ప్రజల అరాధ్యుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు. ఆలాంటి టీడీపీ పగ్గాలను ఆయన నుంచి బలవంతంగా చేజిక్కించుకున్న చంద్రబాబు.. టీడీపీ పార్టీకి తానే అధినేత అయ్యారు. హుటాహుటిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన బాగా అలవర్చుకున్న విధానం వాడుకుని వదిలేయడం. ఆ విధానానికే ఇప్పుడు జనసేన అధినేత.. సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ కూడా బాధితుడిగా మారుతున్నారా..? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి.
1995లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత స్వర్గీయ ఎన్టీ రామారావును పదవీచ్యుతిడిని చేసి.. పగ్గాలను అందుకున్న చంద్రబాబు.. ముందుగా తన తొడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావును, ఆ తరువాత వమరిది, అన్నగారి రథసారధి హరికృష్ణలను కూడా వాడుకుని వదిలేశారు. ఆ సమయంలో హరికృష్ణ సొంతంగా వేరే పార్టీని పెట్టిన సందర్భంలో అయనపై కక్ష సాధింపు చర్యలకు కూడా పాల్పడ్డారు. ఇక పార్లమెంటు సభ్యుడిగా అపారానుభవం వున్న దగ్గుబాటి కూడా పార్టీని వీడి దూరంగా వున్నారు. 1995లో టీడీపీ అధికారంలోకి రాకపోయి వుంటే.. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు కూడా తమ పార్టీలోకి వచ్చే వాడని అప్పటి కాంగ్రెస్ నేతలు బాహాటంగానే ప్రకటించారు. అయితే ఆ వ్యాఖ్యాలపై చంద్రబాబు అప్పట్లో స్పందించ పోవడం కూడా పలు విమర్శలకు తావిచ్చింది.
1995లో పార్టీ అధికారంలోకి రావడానికి అప్పటి మహిళా మణులే కారణమని భావించిన ఎన్టీరామారావు.. మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీ కోసం రాష్ట్రంలో మధ్యనిషేధం విధించారు. చంద్రబాబు పగ్గాలు స్వీకరించిన తరువాత.. మహిళలను నిట్టనిలువునా ముంచాడు చంద్రబాబు. ఓ చేత్తో ఇవ్వడం.. మరో చెత్తో లాక్కోడం బాగా తెలిసిన చంద్రబాబు మహిళలకు డ్వాక్రా రుణాలను ఎరగా వేసి.. మద్యపాన నిషేధాన్ని స్వల్పంగా సడలించారు. ముందుగా కేవలం బార్లు, రిక్రియేషన్ కేంద్రాలకు పరిమితం చేసిన మద్యాన్ని, డ్రై డేలను విధిస్తూ.. వారానికి ఆరు రోజుల పాటు మద్యాన్ని అమ్మె విధానానికి తెరలేపారు. ఈ తరువాత క్రమంగా ఏడు రోజుల పాటు మధ్యం పుల్ గా దోరికింది.
అప్పటి నుంచి ఆంద్రప్రదేశ్ మద్యంధ్రప్రదేశ్ గా మారిందని, రాష్ట్రం పునర్విభజన జరిగినా.. మద్యానికే ప్రాధాన్యం పెరిగి అదే ప్రధాన ఆదాయ వనరుగా మారిందనడం అతిశయోక్తి కాదు. ఆ తరువాత ప్రతిపక్షంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మద్యంద్రాప్రదేశ్ గా మార్చిందని ఆరోపించిన బాబు అధికారంలోకి వచ్చిన తరువాత మధ్యాన్ని పూర్తిగా మర్చిపోయారు. ప్రతిపక్షంలో వుండగా, మధ్యం తాగి వస్తే.. కాపురాలు చేయమని చెప్పండీ అంటూ పిలుపునిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక మద్యాన్ని పక్కన బెట్టి.. మరుగుదోడ్లపై పడ్డారు. మరుగుదోడ్లు లేకపోతే కాపురాలు చేయమని చెప్పండీ అంటూ పిలుపునిస్తున్నారు.
2004లో కాంగ్రెస్ చేతిలో పార్టీ అంపశయ్యపైకి చేరుకోవడంతో.. 2009లోనూ అదే పునరావృతం అవుతుందని భయం చంద్రబాబులో వుండిందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అప్పట్లో ప్రవేశపెట్టిన ప్రజాహిత కార్యక్రమాల నేపథ్యంలో ఆయనను ధీటుగా ఎదుర్కోనేందుకు అప్పట్లో మంచి ఫామ్ లోవున్న జూనియర్ ఎన్టీయార్ ను రంగంలోకి దించారు. జూనియర్ ఎన్టీఆర్ తన శక్తి మేరకు శ్రీకాకుళం నుంచి పార్టీ కోసం ప్రచారాన్ని ప్రారంభించి.. పార్టీ అభ్యర్థులు గెలుపుకోసం పాటుపడ్డారు. అప్పట్లో ఒక దశలో చంద్రబాబు, బాలకృష్ణల ప్రచారం కన్నా జూనియర్ ప్రచారానికే రాష్ట్ర ప్రజలు ముగ్దులయ్యారు. దీంతో ప్రధాన ప్రతిపక్షానికి టీడీపీ పరిమితం అయ్యింది. ఆ తరువాత జూనియర్ ఎన్టీయార్ ను ఎలాగోలా వదిలించుకుంది టీడీపీ.
2014లో వచ్చిన ఎన్నికలలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విడదీసిందని, రాష్ట్రానికి గాఢాంధకారంలో పడేసిందని టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు ఎంతగా గొంతుచించుకుని అరిచినా.. ప్రజలు మాత్రం టీడీపీ పట్ల ముబావంగానే వున్నారు. కాంగ్రెస్ పై కొపాన్ని వెళ్లగక్కిన ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపారు. ఆ తరుణంలో జన సేన పార్టీని స్థాపించి.. ప్రజల్లో అవగాహన కల్పించి.. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని నిశ్చయించుకుని ప్రచారాన్ని ఎక్కుపెట్టిన పపర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రసంగానికి రాష్ట్ర ప్రజలు సమ్మోహితులయ్యారు.
దీన్ని దృష్టిలో పెట్టుకన్న చంద్రబాబు.. ప్రస్తుత పరిస్థితులలో పవన్ ప్రచారం చేస్తే.. తాము అధికారంలోకి రావడం ఖాయమనుకున్నారు. అంతే ఇక క్షణం పాటు కూడా అలస్యం చేయకుండా టీడీపీ కి కూడా పవన్ కల్యాన్ ప్రచారం చేసేలా చూడాలని తనకు అత్యంత సన్నిహతులైన నాయకులకు పురమాయించాడు. పవన్ అందుకు అంగీకరించిన తరువాత పలు షరతులు విధించగా, వాటిపై పవన్ తో చర్చలకు సుముఖత వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఆ తరువాత ఎట్టకేలకు టీడీపి కి కూడా ప్రచారంచేసేందుకు అంగీకరించారు పవన్.
అప్పటి వరకు జోరుగా సాగిన వైసీపీ పార్టీ హోరకు పవన్ ఎంట్రీతో బ్రేకులు పడ్డాయి. పవన్ ప్రసంగం రాష్ట్ర యువతను నిజంగానే అలోచింపజేసింది. ఎవరికి ఓటు వేయాలి అన్న అంశంపై స్పష్టత వచ్చేలా చేసిన పవన్ ప్రసంగంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రమారమి ఆరు లక్షల ఓట్ల మోజారిటీతో అధికారంలోకి వచ్చింది. సుమారుగా వైసీసి అబ్యర్థుల కన్నా 40 స్థానాలను అధికంగా తెచ్చుకుని అధికార పీఠం ఎక్కింది. అయితే పవన్ ప్రచారం కారణంగానే అటు ప్రభుత్వంతో పాటు ఇటు ఎంపీలు కూడా పెద్ద సంఖ్యలో పార్లమెంటులో ప్రాతినథ్యం వహిస్తున్నారు. అయితే ఏడాదిన్నర కాలం కావస్తున్న రాష్ట్రానికి కల్పిస్తామన్న ప్రత్యేక హోదా ఇప్పటికీ తీసుకురావడంలో సీమాంద్ర టీడీపీ ఎంపీలు విఫలం అయ్యారని విమర్శించగానే.. ఎవరి కారణంగా తాము పార్లమెంటులోకి అడుగుపెట్టామన్న విషయాన్ని మరచిన టీడీపీ ఎంపీలు.. వారిపైనే విమర్శలు చేస్తున్నారు. దీంతో మరోమారు టీడీపీ రంగు బయటపడింది. పవన్ కల్యాన్ కూడా చంద్రబాబు వాడుకుని వదిలేసాడని విమర్శలు సర్వత్రా వినబడుతున్నాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more