mla are pro pavan comments while mps differ

Splits in tdp over pavan kalyan comments

pavan kalyan says kcr steped first for telugu people reunity, pavan kalyan on cash for vote case, section 8, hyderabad, cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, sandra venkata veeraiah, Kcr, telangana mlc elections, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, horse riding

Telugu desam party splits over actor turned politician jana sena president power star pavan kalyan comments, as minister and mla are pro to his comments while mps differ

పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీలో చీలికలు..?

Posted: 07/08/2015 07:15 PM IST
Splits in tdp over pavan kalyan comments

సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ వ్యాఖ్యలు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోలా చెప్పాలంటే.. పవన్ మాట్లాడింది ముమ్మాటికీ సత్యాలే అంటూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రులు అంటుండగా, కాదు కాదు అంటూ టీడీపీ ఎంపీలు గొల్లుమంటున్నారు. దీంతో టీడీపీలో అమాత్యులు సహా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మధ్య తీవ్ర అగాధం నెలకొందని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిణామాలపై పవన్ కల్యాన్ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాలు ఆయనకు రాష్ట్రంపై నున్న చిత్తశుద్దిని చాటుతున్నాయని ఎమ్మెల్యేలు అంటున్నారు.

హైదరాబాద్ లో స్థిరపడ్డి సీమాంధ్ర ప్రజలను తెలంగాణ ప్రజానికం ఆంద్రోళ్లు, సెట్లర్స్ అని విమర్శిస్తున్నారని, అయితే సాధారణ ప్రజానికం అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కానీ.. మంత్రి పదవుల్లో వున్నవాళ్లు కూడా ఇలా పక్షపాత వైఖరితో వ్యవహరించడం సమంజసం కాదని పవన్ కల్యాన్ చెప్పారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవుల్లో కోనసాగుతున్న వారు ప్రజల మధ్య పక్షపాతంగా వ్యవహరించరాదని సూచించారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు, అమాత్యులు స్వయంగ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి వినతి పత్రం ఇచ్చారు.హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, అధికారులు, ఉద్యోగులకు భద్రత కరువైందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై తమ నిరసన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 8 అమలు చేయాలని కోరారు.

అయితే ఇదే పవన్ కల్యాన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ ఎంపీలకు మాత్రం రుచించలేదు. ఒక వైపు ఎమ్మెల్యేలు, అమాత్యులు ఆయన వ్యాఖ్యలను ప్రాతిపదికగా చేసుకుని రాష్ట్రపతికి పిర్యాదు చేస్తే.. ఎంపీలకు మాత్రం పవన్ హితోక్తులు రుచించడం లేదు. వ్యాపారాల చేసుకునేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వస్తే.. బావ్యం కాదని, ఇప్పటికైనా వ్యాపారాలను పక్కన బెట్టి.. రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఆయన సూచించడం వారికి మింగుడు పడలేదు. కాదు మాకు వ్యాపారాలే ముఖ్యమని బావించినా.. లేక ప్రత్యేక హోదా కోసం అడగాలంటే జంకుతున్నా.. తక్షణం మీ పదవులకు రాజీనామా చేయాలని ఆయన కొంత తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అయితే ఎవరి కోసం.. ఎందుకోసం ఆయన తమపై మండిపడ్డారన్న విషయాన్ని అర్థం చేసుకోని ఎంపీలు.. పవన్ వ్యాఖ్యలతో ఏమాత్రం ఏకీభవించలేదు. మీడియా సమావేశాన్ని పెట్టి మరీ పవన్ పై విరుచుకుపడ్డారు. కేసులు పెడతామని హెచ్చరించారు.

దీంతో దేనికైనా తాను సద్దిమేనని పవన్ కల్యాన్ తనదైన శైలితో స్పందించారు. రాష్ట్ర హితం కోసం తాను అన్నింటికీ సిద్దంగానే వున్నానని చెప్పుకోచ్చారు. టీడీపీ ఎంపీలు తనపై చేసిన విమర్శలపై ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఉద్యమించాలని తాను చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు తనపై కేసు పెడతామని హెచ్చరించడాన్ని పవన్ కల్యాన్ సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్ర హితం కోసం తాను జైలుకైనా, కోర్టకైనా వెళ్లడానికి సంతోషమేనని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే అందుకు తగిన ఏర్పాటు త్వరగా చేస్తే మంచిదని, ఎంపీలకు నూచించారు. కాగా పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు మధ్య అగాధం ఏర్పడిందని కూడా గుసగుసలు వినబడుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pavan kalyan  twitter  AP TDP MPs  parliament members  

Other Articles