వికీలీక్స్ వెల్లడించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ట్యాపింగ్ కోసం సింగపూర్ హ్యాకింగ్ టీమ్‌కు... ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, వారి తొత్తులుగా ఉన్న చానెళ్ల కుట్ర చేస్తున్నాయని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనాలకు, మెయిల్స్‌కు సంబంధించి... ఏపీ ప్రభుత్వానికి సబంధంలేదని మంత్రి యనమల స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందంటూ.. ఇది చట్ట విరుద్దమంటూ ప్రగల్భాలు పలికని చంద్రబాబు అసలు నైజం మరోమారు బయటపడింది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఫోన్ లో సంబాషణలు వెలువడిన తరువాత తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని తీవ్రస్థాయిలో గగ్గోలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ నేతలు, శ్రేణుల నోట్లో ఇప్పడు పచ్చి వెలకాయ పడింది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా చేసిన చంద్రబాబు.. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తనకు ఎక్కడ నోటీసులు ఇస్తుందో.. సీఎం పదవికి తాను ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందోనన్న ఆందోళనలో చంద్రబాబు.. తమ వద్ద ఆధారాలు వున్నాయంటూ.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. ఓటుకు నోటు కేసులో నిందితుల జాబితా నుంచి తప్పించుకున్నారు. అయితే అదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్దమని, ఇది చాలా పెద్ద కేసు అని, గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో చిక్కుకుని ప్రభుత్వాలు కూడా కూలిపోయాయని నీతి సూక్తులు చెప్పిన చంద్రబాబు.. అది చాలదన్నట్లు సెక్షన్ 8 ను కూడా తెరపైకి తీసుకుచ్చారు.
ఇంతవరకు బాగానే వున్నా.. ఆయన చెప్పినవన్నీ నిజాలే అయినా.. మరి ఆయననెందుకు ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. పోరుగు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు వచ్చి తమ రాష్ట్రంలో తలదాచుకున్న పక్షంలో సమాచారం పసికట్టడానికని కొందరు అంటున్నా.. రాష్ట్రంలో ఉగ్రవాదులు ఎలాంటి సంఘవ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడకుండా అని మరికోందరు అంటున్నా.. ఈ వ్యవహరాంలో కేంద్రానికి లేఖ రాస్తే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఖచ్చితంగా నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది కాదా..? అన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.
వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్న విధంగా.. తెలంగాణ ప్రభుత్వంలోని కేసీఆర్ సహా పలువురు ముఖ్యనేతలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక ప్రతిపక్షం వైసీపీ ముఖ్యనేతల ఫోన్లను ట్యాప్ చేసేందుకు చంద్రబాబు పూనుకున్నారని, అందుకనే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెల్ఫోన్లు, ఈ మెయిల్ సమాచారాన్ని దొంగచాటుగా ట్యాప్ చేసే టెక్నాలజీని సమకూర్చుకునేందుకు యత్నించారన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి. కాగా టీడీపీపై ఈగ వాలనీయకుండా కంటికి రెప్పలా కాపాడుకునే నాయకులు మరోమారు ఈ వ్యవహారంపై తెరముందుకు వచ్చారు.
వికీలీక్స్ వెల్లడించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ట్యాపింగ్ కోసం సింగపూర్ హ్యాకింగ్ టీమ్‌కు... ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, వారి తొత్తులుగా ఉన్న చానెళ్ల కుట్ర చేస్తున్నాయని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనాలకు, మెయిల్స్‌కు సంబంధించి... ఏపీ ప్రభుత్వానికి సబంధంలేదని మంత్రి యనమల స్పష్టం చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more