ఈ శీర్షిక చూడగానే శుభలగ్నం చిత్రంలోని అమని పాత్ర కళ్లముందు కదలాడుతుంది. అక్కడ డబ్బుకోసం భర్త పిల్లలను కాదనుకున్న ఇల్లాలు.. ఆ తరువాత డబ్బు కన్నా పవిత్రమైన మానవీయ సంబంధాలే ముఖ్యమని తెలుసుకుంటుంది. అయితే అలాంటి డోలాయమాన పరిస్థితుల్లోనే ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, గ్రామీణ అభివృద్ది శాఖల మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వున్నట్లు కనబడుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన డొక్కా మాణిక్యవరఫ్రసాద్ ఈ నెల 13న వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్ సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆయన పార్టీ తీర్ఘం పుచ్చుకోవడానికి రమారమి ఏర్పాట్లు పూర్తైన చివరి క్షణంలో ఆయన మనసు మార్చుకున్నారు. తాను వైసీపీలో చేరడం లేదని మాణిక్యవరప్రసాద్ చెప్పారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానాలు రావడంతో అంగీకరించానని.. అయితే ప్రస్తుతం నిర్ణయం మార్చుకున్నానని తెలిపారు.
తాను రాజకీయాల్లో పదకొండేళ్ల బాలుడినని, ఇంకా ఎంతో అధ్యయనం చేయాల్సి ఉందని, ప్రస్తుతం నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నానని చెప్పిన ఆయన.. ప్రస్తుత రాజకీయాలకు తాను పనికి రాననిపిస్తోందని వేదాంత ధోరణిని వ్యక్తం చేశారు. తన రాజకీయ భవిష్యత్తు అంతా అయోమయంగా ఉందని, తాను ఇక రాజకీయాల్లో ఉండకపోవచ్చేమోనని వ్యాఖ్యానించారు. నిజమే మంచి మనస్సున్న మనిషి, ప్రజలకు నిత్యం అందుబాటులో వుండి సేవలనందించే కల్మషం లేని నేత, ప్రజావసరాలే పరమావదిగా భావించే నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్. అందుకనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తన మూలాలను మాత్రం మర్చిపోలేదు. తనకు రాజకీయాలకంటే ఎంపీ రాయపాటి సాంబశివరావే ముఖ్యమని చెప్పారు.
తాజా పరిణామాల నేపథ్యంలో మాణిక్యవరప్రసాద్ టీడీపీలోకి చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.దీనికి మాణిక్యవర ప్రసాద్ రాజకీయ గురువు గుంటూరు పార్లమెంటరీ సభ్యుడు రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. వరప్రసాద్‌ని టీడీపీలోకి తీసుకురావాల్సిందిగా సీఎం చంద్రబాబు తనను అడిగారని, ఆయన సేవలు పార్టీకి అవసరంగా సీఎం భావిస్తున్నారని చెప్పారు. టీడీపీలో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన నేతల కోరత ఏర్పడిందని, మాణిక్యవరప్రసాద్ చేరికతో మరికొందరు ఎస్సీ నేతలు టీడీపీలో చేరే అవకాశాలు వుంటాయని చంద్రబాబు భావిస్తున్నారని తెలిపారు.
అయితే తనకు టీడీపీలో చేరడం ఏ మాత్రం ఇష్టం లేకపోయినా.. తనను తన గురువర్యులు ఒత్తిడి చేస్తుండటం కూడా ఇబ్బందిగా భావిస్తున్నారు వరప్రసాద్. టీడీపీలోకి వెళ్లడం కన్నా వున్న పార్టీలోనే మనగలిగితే చాలునన్న భావన ఆయనలో వుంది. రాజకీయ ఆరంగ్రేటం చేసిన అనతి కాలంలోనే మంత్రి పదవినిచ్చి.. తనను గౌరవించిన కాంగ్రెస్ లో కొనసాగమే మంచిదన్న భావనలో డొక్కా మాణిక్య వర ప్రసాద్ వున్నారని సమాచారం. మరి ఆయన ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గి ఏ పార్టీలోకి చేరుతారో కాలమే సమాధానం చెబుతుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more