మునుపెన్నడూ లేని విధంగా బిజేపి తన స్వామి భక్తిని చాటుకుంటూ ముందుకు సాగుతోంది. దాదాపుగా మూడు దశాబ్ధాల అనంతరం ఏకఫక్ష మోజారిటీతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ప్రభుత్వం.. ఇందుకు కారణమైన వారిని విస్మరిచకుండా వారికి గౌరప్రదమైన అవార్డులను అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తొలిసారిగా నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో జాబితాలోనూ పలువరు ఆద్యాత్మిక వేత్తలు, గురుజీలు వుండటం వివాదాస్పదంగా మారగా.. కేంద్రం జాబితాను కుదించింది.
ఆ తరువాత మరోమారు ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం అదేంటంటారా..? ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కు డాక్టరేట్ పట్టాను అందించనున్నారు. అయితే దీనికి పూనుకుంది మాత్రం హర్యానా రాష్ట్రప్రభుత్వమని తెలుస్తుంది. ఈ నెల 26న హర్యానాలోని హిస్సార్ లో గల హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టాను అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి హర్యానా రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా వున్న బాబా రాందేవ్ ను ముఖ్య అతిధిగా అహ్వానించారు. కాగా ఈ కార్యక్రమంలోనే ఆయనకు డాక్డరేట్ పట్టాను అందించనున్నారని తెలుస్తుంది.
ఈ కార్యక్రమానికి మరో ముఖ్యఅతిధిగా హాజరుకానున్న ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ చేతుల మీదుగా డాక్టరేట్ ను స్వీకరించనున్నారని సమాచారం. డాక్టరేట్ ప్రధానం కసం బాబా రాందేవ్ అనుమతి కోరుతూ ఆయనకు విశ్వవిధ్యాలయం అధికారులు లేఖ కూడా రాసినట్లు తెలిసింది. అయితే ఈ విశ్వవిద్యాలయం నుంచి ఇప్పటకే పలువరు మాజీ ప్రధానులు, చౌదరి చరణ్ సింగ్, పివీ నర్సింహా రావు, మన్మోహన్ సింగ్ లతో పాటు మాజీ డిప్యూటీ ప్రధాని చౌదరి దేవీలాల్ తదితరులు గౌరవ డాక్టరేట్ లు ప్రధానం చేశారు. కాగా విద్యాభ్యాసాన్ని మధ్యలోనే వదిలేసిన బాబా రాందేవ్ డాక్టరేట్ పట్టాను అందించనున్నారన్న వార్తలపై విద్యావంతులు మండిపడుతున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more