ఓటకు నోటు కేసును కౌంటర్ చేసేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసని ఫోన్ ట్యాపింగ్‌పై కేసును నీరుగార్చేందకు తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తుంది. దీంతో ఈ కేసు ముందుకు సాగడం కూడా కష్టంగా మారుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ లో మాట్లాడిన ఆడియో టేపులు మీడియాలో ప్రసారం కావడంతో.. తమ ఫోన్లను ట్యాప్ చేశారన్న కోణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసును నమోదు చేసింది.
తమ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుగా పసిగట్టలేకపోవడం.. ఇంటెలిజెన్స్ తప్పిందంగా పేర్కోన్న ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డిఐజి గా విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారిని అనురాధ పై కూడా బదిలీ వేటును వేసింది. అయితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై న్యాయస్థానంలో వాదనలు ఆరంభమయ్యాయి. కోర్టుకు సర్వీసు ప్రొవైడర్ల తరపు న్యాయవాదులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కాల్‌డేటా ఇవ్వవద్దని మెమో ఫైల్ చేసిందని, డేటా ఇస్తే ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించిందని, అందుకే కాల్‌డేటా ఇవ్వలేమని సర్వీసు ప్రొవైడర్లు కోర్టుకు చెప్పారు.
అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సమాచారం ఇవ్వవద్దని తమను ఆదేశించిందని సర్విస్ ప్రోవైడర్ తరపు లాయర్లు కోర్టుకు విన్నవించారు. దీంతో కేంద్రం ఉత్తర్వులను కోర్టును నిర్దేశించలేవని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై న్యాయస్థానం ఎలా ముందుకువెళ్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకోంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more