telangana home secretary venkatesham transferred without information..?

Venkatesham victim of telangana use and throw policy

cash on vote, phone tapping, KCR, IAS officer, B.Venkatesham, home secratary, notices to service providers, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

telangana home secretary venkatesham transferred without information from home department by the state government

కేసీఆర్, ఇది నీకు తగునా.. వాడుకుని వదిలేస్తారా..?

Posted: 07/30/2015 06:09 PM IST
Venkatesham victim of telangana use and throw policy

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంతో సంబంధం ఉన్న తెలంగాణ ఐఏఎస్‌ అధికారి బి.వెంకటేశం తీవ్ర అసంతృప్తితో వున్నారు. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం తనను వాడుకుని వదిలేసిందని మదనపడుతున్నారు. కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ స్థానికత ఉన్న తనకు ప్రత్యేక రాష్ట్రంలో కీలక పదవే దక్కుతుందని వెంకటేశం ఆశిస్తూ వచ్చారు. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వెంకటేశంకు సీఎంవోలో చోటు దక్కుతుందని భావించారు. అయితే సీవోంలో వెంకటేశంకు చోటు దక్కలేదు.

అయితే ఆయనకు హోం శాఖ కార్యదర్శిగా నియమించినట్టే నియమించిన కేసీఆర్ ప్రభుత్వం.. అంతలోనే ఆయనను పక్కకు తప్పించింది. ఇందుకు కారణం కూడా ప్రభుత్వమే అంటు ఆయన అవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు కేటాయించిన హోం శాఖ కార్యదర్శి పదవి కూడా మూనాళ్ల ముచ్చటగానే మారడంతో ఇప్పుడు తానేం చేయాలన్న మిమాంసలో పడ్డారు వెంకటేశం. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అధికార పార్టీలకు మధ్య తాను ఇరుక్కుపోయానని భావించిన ఆయన ఇక రాష్ట్రాల గోడవకు దూరంగా కేంద్రం సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఓటుకు నోటు కేసులో.. టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్రా వెంకట వీరయ్య సహా పలు ముఖ్యనేతలు వారి బాస్ అదేశానుసారం పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓట్లను డబ్బుతో కొనుగోలు చేసేందుకు యత్నించిన కేసులో  ముఖ్యనేతల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్‌ చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులందరినీ తెలంగాణ ప్రభుత్వం పక్కకు తప్పిస్తోంది. ఇందులో భాగంగా పక్కకు తప్పించిన జాబితాలో ముందున్న పేరు వెంకటేశం.
 
ట్యాపింగ్‌ చేయాలంటూ హోంశాఖ సెక్రటరీ అనుమతి తప్పనిసరి. ఈ కారణంగా హోంసెక్రటరీగా వెంకటేశం నేరుగా ఈవ్యవహారంలో కూరుకుపోయారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనను పక్కకు తప్పించి రాజీవ్‌ త్రివేదిని హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. తనను మార్చే విషయంలో వెంకటేశం అసంతృప్తితో రగిలి పోతున్నారు. సెలవులో ఉన్న సమయంలో తనకు మాటమాత్రం కూడా చెప్పకుండా తప్పించారని ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్య కార్యదర్శిగా పదవి తనను వరిస్తుందని ఆశించారట.

అయితే సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి ఇవ్వడం ఆనవాయితీ అయినట్లైతే కనీసం తనను హోంసెక్రటరీగా కొనసాగిస్తారని భావించారట. కానీ ఆ పోస్టును కూడా ఓ మహిళా అధికారితో భర్తీ చేశారు. రాష్ట్రం వచ్చాక తెలంగాణ స్థానికుడిగా కీలక పదవి వస్తుందని భావిస్తే ఇలాంటి అవమానాలు ఏంటని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీఎస్‌ రాజీవ్ త్రివేదిని కలిసి తన ఆవేదనను వెల్లగక్కారట. తనను కీలక సమయంలో ప్రభుత్వం వాడుకుని వదిలేసిందనే అభిప్రాయంతో వెంకటేశం ఉన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash on vote  phone tapping  KCR  IAS officer  Venkatesham  

Other Articles