ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నారా..? జరుగుతున్న పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. ఏడాది పాలన పూర్తి కాగానే మంత్రివర్గంలో మార్పులు చేయాలని చంద్రబాబు భావించారు. అయితే అనేక ఉదంతాలు, ఉపద్రవాలతో అది వాయిదా పడుతూ వస్తున్నది. తొలుత ఓటుకు కోట్లు అంశం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపింది. ఆ తర్వాత పుష్కరాలను ఘనంగా నిర్వహించి ఆ మచ్చ నుంచి జనం దృష్టిని మరలిద్దామని ఆయన భావిస్తే అందులో ఓ ఉపద్రవం ముంచుకొచ్చింది. 29 మంది భక్తుల మరణం చంద్రబాబు సర్కారు పనితీరుకు ప్రశ్నార్థకంగా మారింది. ఇపుడు పరిస్థితి కొంచెం కుదుటపడినందున ఇక ప్రక్షాళనపై దృష్టిసారించాలని ఆయన యోచిస్తున్నారని సమాచారం.
మూడు రోజుల్లో చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన తిరిగొచ్చిన తరువాత మంత్రివర్గ మార్పులు, చేర్పులపై దృష్టి పెడతారని భావిస్తున్నారు. రెండో తేదీన ఆయన కుటుంబ సమేతంగా విదేశీ యాత్రకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన పర్యటన ఏ దేశానికి అన్నది రహస్యంగా ఉంచినప్పటికీ, టర్కీకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆ తరువాత అధికారిక పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాకు కూడా వెళ్లనున్నారు. ఆగస్టు 31వ తేదీ నురచి శాసనసభ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మధ్య కాలంలో మంత్రివర్గ విస్తరణ, మార్పులు, చేర్పులు ఉరటాయని భావిస్తున్నారు.
ఈ విస్తరణలో కనీసం ఐదుగురు మంత్రులకు ఉద్వాసన ఉండవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న వారిలో ఇద్దరికి ఉద్వాసన ఉంటుందని అరటున్నారు. ఆ ఇద్దరి పనితీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన పేషీ అధికారులే అంటున్నారు. ఇదే సమయంలో కొరతమందిపై వస్తున్న అవినీతి ఆరోపణలు, పనితీరును సరిగా లేకపోవడం వంటి అంశాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోరది. ఈ నేపథ్యంలో అటువంటి వారిపై కూడా వేటు తప్పదన్న భావం సర్వత్రా వ్యక్తమవుతోరది. మరోవైపు అటు ఉత్తరాంధ్ర, ఇఠు రాయలసీమ నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నవారి జాబితా పెద్దదిగానే ఉంది. మార్పులు చేర్పులు అనివార్యమని, అందరూ అందుకు సిద్ధంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యనాయకులకు ఇప్పటికే సమాచారముందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more