రెండు తెలుగు రాష్ట్రాలగా విడిపోయిన తరువాత కూడా ఏర్పడిన చంద్రలు ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్దిలో పోటీ పడాల్సింది పోయి ఇంకా వివాదాలను పెద్దవిగా చేస్తున్నాయి. అక్కడి వారినై ఇక్కడ, ఇక్కడి వారిపై అక్కడ ద్వేషభావాన్ని పెంపోందించేలా రెండు తెలుగు రాష్టాల పాలకులు తెరవెనుక చర్యలు చేపడుతున్నారా..? అంటే రమారమి అవుననే సమాధానాలే వస్తున్నాయి. ప్రభుత్వాలు పోరుగు రాష్ట్ర ప్రభుత్వాలపై విషం చిమ్ముతన్నా.. ప్రజలకు మాత్రం ఏ కోశానా నష్టం వాట్లిల్లడం లేదు. ప్రభుత్వాల మధ్య పోరపచ్చాలు వస్తున్నాయి కానీ, ప్రజల మధ్య మాత్రం ఎలాంటి తారతమ్యాలు లేకుండా అప్పడు, ఇప్పుడు కలసిమెలసి అన్యోన్యంగానే వుంటున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్య రాగద్వేషాలు తీవ్రస్థాయికి చేరాయి.
అందుకు కారణం మాత్రం టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను బట్టలో వేసుకుని తమ పార్టీలోకి చేర్చుకుంటుందని టీడీపీ పార్టీ అరోపిస్తుంది. అయితే తమ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ సహా పలువురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి వారికి అడ్డదారిలో డబ్బులివ్వడానికి టీడీపీ ప్రయత్నించి.. ఆ పార్టీ నేతలు ఏసీబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారని తెలంగాణ అధికార ప్రభుత్వం, పార్టీ నేతలు అరోపిస్తున్నారు. అయితే ఇదే అంశం ఇటు అంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలోనూ ప్రకంపనలు సృష్టిస్తుంది.
జగన్ అవినీతి గురించి మాట్లాడే హక్కులేదని విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ.. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని కట్టడి చేయాడానికి చేసిన అన్ని యత్నాలు ఫలించాయి. అయితే ఇదే అంశంపై ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చల సందర్భంగా మంత్రి అచ్చన్నాయుడు చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అదేంటంటారా.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్య ఫోన్ సంబాషణలు జరిగినట్లు ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద వున్నాయన్నారు.
కేసీఆర్ సూచనల మేరకే జగన్ నడుస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా చెప్పుకుంటున్న జగన్.. తెలంగాణ సీఎం చేతిలో బొమ్మగా మారారన్నారు. ‘‘ఓటుకు నోటు గురించి ఏపీ శాసనసభలో ఇంకా ఎందుకు ప్రస్తావించలేదని కేసీఆర్ ఫోన్లో అడిగిన తర్వాతే ప్రతిపక్ష నేత సభలో ఆ విషయాన్ని జగన్ ప్రస్తావించారన్నారు. వైసీపీ అధ్యక్షుడికి గత గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి ఫోన్ చేసినట్లు మా దగ్గర సాక్ష్యం ఉంది’’ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఇంత వరకు బాగానే వున్నా.. ఇక్కడే అసలు సమస్య తలెత్తింది.
అచ్చెన్నాయుడు సాక్ష్యం గురించి మాట్లాడటం వెనుక అంతరార్థం అర్థకావడం లేదు. ఇదే అసెంబ్లీ సమావేశాల్లో జగన్, తెలంగాణ మంత్రి హరీష్ రావు ఇద్దరూ గ్రాండ్ హోటల్ లో కలసి మే 21న చర్చించుకున్నారని, ఆ తరువాతే రేవంత్ రెడ్డి తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ష్టిఫెన్ సన్ నివాసంలో ఆయనకు 50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికాడని, ఇదే క్రమంలో ఓటుకు నోటు కేసు నమోదుకు కూడా జగన్ కారణమని ఆరోపించారు. ఈ రెండు ఘటనల్లో తమ వద్ద ఆధారాలు వున్నాయని అసెంబ్లీ సాక్షిగా అధికార పక్షం ప్రకటించింది.
ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకు చేసిన ఈ వ్యాఖ్యలు చేశారా అనుకుంటూ.. అది అసెంబ్లీ మీడియా పాయింటు వద్దో..? లేక పార్టీ కార్యాలయం ట్రస్టు భవన్ లోనో చేసివుంటే అర్థవంతంగా వుండేది. కానీ అలా కాదని, ఏకంగా అసెంబ్లీ సమావేశాల్లో సాక్షాలు వున్నాయని ప్రభుత్వం ప్రకటించడం, అంగీకరించడం పలు ప్రశ్నలు సమాధానాలు ఇస్తుంది. ఇటీవల ఓటుకు నోటు కేసు నమోదైన తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పరికరాలను తెప్పించిందని అప్పట్లో పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో వార్తలు ప్రచురితం అయ్యాయి.
అయితే అ కథనాలను మంత్రి యనమల వెనువెంటనే తోసిపుచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కథనాలు అవాస్తవమన్నారు. కానీ ప్రస్తుతం పరిణామాలు గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పరికరాలను తెప్పించడంతో పాటు వినియోగిస్తుందన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఈ పరికరాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా..? లేక ఆయన తనయుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా..? లేక కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా... ? వీరెవ్వరూ కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా..? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఓటుకు నోటు కేసులో తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ.. అన్ని కేసుల కన్నా ట్యాపింగ్ కేసు అతిపెద్ద నేరమని, ఈ నేరానికి గతంలో ప్రభుత్వాలు కూడా కుప్పకూలాయని చెప్పిన వారే ఇప్పుడు ట్యాపింగ్ కు పాల్పడుతున్నారా..? అన్న సందేహాలు తెరమీదకోస్తున్నాయి. కేసీఆర్, జగన్ లు ఫోన్ లో మాట్లాడితే మంత్రి అచ్చెన్నాయుడు వద్ద సాక్షాలు ఎలా లభిస్తాయన్నదే ఈ సందేహాలకు బీభం వేస్తుంది.
రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేతలు, పోరుగు రాష్ట్రం అధికార పక్షానికి చెందిన మంత్రులు, కీలక నేతలు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్నారా..? అన్న అనుమానాలను ప్రభుత్వమే పటాపంచలు చేయాల్సిన అవసరం వుంది. తాము చేస్తే శృంగారం.. అవతలి వాళ్లు చేస్తే వ్యభిచారం అన్న చందంగా పైగా ఎదుటివారు చేస్తే గగ్గోలు పెట్టిన ప్రభుత్వం.. అదే తప్పుడు పనికి పాల్పడుతుందా..? ఏది ఏమైనా ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వంపైన వుంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more