KCR planned to stop Revanth Reddy

Telangana cm kcr planned to stop revanth reddy

Telangana, Assembly, Revanth Reddy, KCR, TRS, TDP, farmers, Suicides

Telangana cm KCR planned to stop Revanth Reddy. Telangana assembly session will star from next week. Revanth Reddy and other opposition leaders getting ready to attack on KCR Govt.

రేవంత్ ఆటకు కేసీఆర్ చెక్..?!

Posted: 09/24/2015 11:53 AM IST
Telangana cm kcr planned to stop revanth reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు టైం ఫిక్సైంది. తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శనాస్ర్తాలను సందించడానికి ప్రతిపక్షాలు సిద్దంగా ఉన్నాయి. ముఖ్యంగా టిడిపి నాయకులు ఎటాక్ కు సిద్దంగా ఉన్నారు. తెలుగుదేశం తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అయితే ముందు నుండే కారాలు మిరియాలు నూరుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని రేవులో ఉతికేస్తానని అంటున్నారు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అన్ని లెక్కలు కూడా సిద్దంగా చేసుకన్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి మాటల దూకుడుకు ఎలా కళ్లెం వెయ్యాలన్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి చివరకు కేసీఆరే ఓ పరిష్కారాన్ని చూపించారట. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన మీద, తన వాళ్ల మీద ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు సామాచారం. జైల్ నుండి విడుదలైన తర్వాత నుండి రేవంత్ రెడ్డి పేరు మీద చాలా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఆట మొదలైంది అనే టైటిల్ తో వెలిసిన ఫ్లెక్సీల మీద కూడా చర్చ సాగింది. అయితే రేవంత్ రెడ్డి ఆటకు కేసీఆర్ చెక్ పెట్టనున్నారట. అది కూడా గుక్కతిప్పుకోకుండా రేవంత్ ను ఒక్కిరిబిక్కిరి చేస్తారట. అసలు కేసీఆర్ ప్లానేంటి..? తెలుసుకోవడానికి మొత్తం స్టోరీ చదవండి.

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. గతంలో కన్నా కూడా రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగినట్లు ప్రతిపక్షాలు నివేదికలను కూడా సిద్దం చేసినట్లు సమాచారం. అయితే వచ్చే వారం ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ పూర్తి స్థాయి సమావేశాల్లో ప్రభుత్వాన్ని కడిగిపారేయాలని ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి. ఇక ప్రతిపక్షాల నేతల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన రేవంత్ రెడ్డి అయితే అన్ని రకాల అస్ర్తశస్ర్తాలతో అసెంబ్లీకి రానెన్నట్లు తెలుస్తోంది. అయితే రేవంత్ దూకుడును అసెంబ్లీలో కట్టడి చెయ్యడానికి కేసీఆర్ ప్లాన్ వేశారట. రేవంత్ రెడ్డికి చెక్ చెప్పడానికి ఓ తరుణోపాయాన్ని కూడా సూచించారట. అదే వేటు.. అవును అసెంబ్లీ సమావేశాల నుండి బహిష్కరణ వేటు వెయ్యడం ద్వారా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గొడవ లేకుండా ప్రశాంతంగా సాగుతుందని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించినట్లు సమాచారం. అయితే గతంలో వేసిన వేటు మీద, పార్టీ ఫిరాయింపుల మీద కూడా ప్రభుత్వాన్ని నిలదీసే పనిలో రేవంత్ రెడ్డి అండ్ కో సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Telangana  Assembly  Revanth Reddy  KCR  TRS  TDP  farmers  Suicides  

Other Articles