Govt alloted lands for NTR Trust bhavan going contraversial

Govt alloted lands for ntr trust bhavan going contraversial

NTR Trust Bhavan, Chandrababu Naidu, Lands, AP, NTR Bhavan, Service, Chandrababu Contraversial

Govt alloted lands for NTR Trust bhavan going contraversial. AP Govt allot lands to NTR Trust bhavan, which belongs to AP cm Chandraabu Naidus family.

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ భూములు ఎందుకంటే..?

Posted: 09/23/2015 04:22 PM IST
Govt alloted lands for ntr trust bhavan going contraversial

వడ్డించే వాడు మనవాడైతే.. బంతిచివర కూర్చున్నా కానీ మన భోజనం వచ్చేస్తుంది అని ఓ నానుడి ఉంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ముఖ్యమంత్రి గారే తలుచుకుంటే భూములకు తక్కువా. తాజాగా ఇలా ఓ ముఖ్యమంత్రి గారి వ్యవహారం కాస్త వార్తల్లో నిలుస్తోంది. దేశం రాజకీయాల్లో అపర చాణిక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గురించే ఇప్పటి దాకా చెప్పిన ఉపోద్ఘాతం. అయితే రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అని గట్టిగా నమ్మే చంద్రబాబు నాయుడే కాస్త గీత దాటారేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఏపి సర్కార్ కేటాయించిన భూముల వ్యవహారంలో కాంట్రవర్సియల్ అయింది. అది కూడా తన మామగారి పేరు మీద ఉన్న ఓ ట్రస్టు వ్యవహారమే చంద్రబాబును విమర్శపాల్జేస్తోంది.

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబందించిన ఎన్.టి.ఆర్.ట్రస్టు కు కాకినాడ, శ్రీకాకుళంలలో ప్రభుత్వ భూములు లీజుకు ఇచ్చిన విషయంపై బిన్న కదనాలు వచ్చాయి. ఒక పత్రికలో సేవా కార్యక్రమాలకు గాను భూమిని లీజుకు ఇచ్చారని తెలపగా, మరో పత్రిక నిబంధనలకు విరుద్దంగా భూమి లీజు ఇచ్చారని వ్యాఖ్యానించింది. కాకినాడలో విలువైన జడ్పి భూమి రెండువేల గజాల మేర 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.నెలకు పాతికవేల రూపాయల అద్దెను ఇవ్వవలసి ఉంటుంది.ఏ భూమి అయినా 30 ఏళ్లకు మించి లీజుకు ఇవ్వడానికి లేకపోయినా, 99 ఏళ్లకు లీజుకు ఇచ్చారని చెబుతున్నారు.ఇలాగే శ్రీకాకుళంలో కూడా గురుకుల పాఠశాలకు కేటాయించిన 1.79 ఎకరాల బూమిని కూడా ఎన్.టి.ఆర్.ట్రస్టుకు తొంభైతొమ్మిదేళ్ల లీజుకు ఇచ్చారు.ముఖ్యమంత్రిగారి ట్రస్టుకు ఆ మాత్రం బూములు కేటాయించరా? అని కూడా చర్చ సాగుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR Trust Bhavan  Chandrababu Naidu  Lands  AP  NTR Bhavan  Service  Chandrababu Contraversial  

Other Articles