Venkaah Naidu willbe next Vice President

Venkaah naidu willbe next vice president

Venkaiah Naidu, Modi, NDA Govt, Vice President, Rajyasabha, Parliament, Venkaiah Naidu on Parliament, Venkiah Naidu

Central Minister venkaiah Naidu may get Vice President post. Venkaiah Naidus Rajasabha period will expire on Next June, So BJP plans to offer vice President post to him.

ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు..?

Posted: 12/05/2015 09:51 AM IST
Venkaah naidu willbe next vice president

రాజ్యాంగపరంగా దేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ఉప రాష్ట్రపతి పదవి తెలుగువాడైన వెంకయ్యనాయుడిని వరించబోతోందా ? బీజేపీ వర్గాల్లో సాగుతున్న చర్చ నిజమైతే… వెంకయ్య దేశానికి వైస్ ప్రెసిడెంట్ కావడం ఖాయమేనా ? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే ఏడాది జూన్ నాటికి వెంకయ్య రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది. బీజేపీ నియమావళి ప్రకారం ఓ వ్యక్తికి మూడు సార్లు మించి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వీలుకాదు. పార్టీ నియమాలను నిక్కచ్చిగా పాటించే పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ… వెంకయ్యనాయుడు కోసం తమ నియామాన్ని పక్కన పెడుతుందన్న నమ్మకం చాలామందిలో కనిపించడం లేదు. అదే జరిగితే కేంద్రమంత్రిగా కొనసాగేందుకు వెంకయ్య లోక్ సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అందుకు ఆయన సుముఖంగా లేరని సమాచారం.

దీంతో వచ్చే ఏడాది జూన్ లో రాజ్యసభ పదవీకాలం ముగించుకోబోతున్న వెంకయ్యను మరో ఆరు నెలల పాటు మంత్రిగా కొనసాగించాలని నరేంద్రమోదీ భావిస్తున్నారట. ఆ తరువాత 2017 ఆగస్టులో జరగబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యను నిలిపి… ఆయనను ఆ పీఠాన్ని కట్టబెట్టాలని మోదీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న వెంకయ్య సేవలను మోదీ అంత ఈజీగా వదులుకోరని… ఏదో రకంగా ఆయన లోక్ సభ లేదా రాజ్యసభ నుంచి తిరిగి ఎన్నికయ్యేలా చేస్తారని మరికొందరు అంటున్నారు. అలా కాని పక్షంలో మాత్రం వెంకయ్యకు ఉప రాష్ట్రపతి పదవి గ్యారంటీ అని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ అగ్రనేత ఎల్.కే. అద్వానీని రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలపాలని భావిస్తున్న మోదీ… వెంకయ్యను ఉప రాష్ట్రపతి చేసినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. మరి… వెంకయ్య ఉప రాష్ట్రతి అవుతారా లేక ఏదో రకంగా ఉభయ సభల్లోనే ఎంపీగా కొనసాగుతారా అన్నది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles