ఏపీ మంత్రివర్గంలో పునర్వవస్థీకరణ అంటూ జరిగితే గంటా శ్రీనివాసరావు మీద వేటు పడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలాసార్లు సీరియస్ అవుతున్నప్పటికీ ఈ మంత్రిగారి తీరు మారకపోవడంతో చంద్రబాబు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. నారా లోకేష్ సహా చంద్రబాబుకి సన్నిహితంగా ఉంటున్న మరోమంత్రి నారాయణకు స్వయంగా వియ్యంకుడైన గంటా పూర్తిగా చిరంజీవి మనిషిలా వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబుకి నచ్చడం లేదని సమాచారం. చాలాకాలంగా గంటా శ్రీనివాసరావు , చిరంజీవి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరూ ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ లోకి చేరి చెరో చోట మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఆతర్వాత ఎన్నికలకు ముందు చిరంజీవిని విడిచి గంటా సైకిలెక్కేసినప్పటికీ ఆయనతో సంబంధాలు మాత్రం కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ చిరంజీవి ఇంట జరిగే అన్ని వ్యవహారాలు గంటా సొంత వ్యవహారంగానే భావిస్తున్నారు. ఇటీవల శ్రీజ వివాహం బెంగళూరులో జరిగినప్పుడు హాజరైన ఏకైక మంత్రి గంటా శ్రీనివాసరావే కావడం విశేషం. అంతేగాకుండా విశాఖలో మెగా హీరో అల్లు అర్జున్ సినిమా సరైనోడు ఫంక్షన్ వ్యవహారాలన్నీ పూర్తిగా తన భుజాల మీద వేసుకుని గంటా నిర్వహించినట్టు చంద్రబాబు భావిస్తున్నారు. చివరకు చిరంజీవి వస్తున్నందున టీడీపీ కార్యకర్తలను అక్కడికి తరలించినట్టు కూడా చెబుతున్నారు.
అయితే ఆ వేడుకల్లో చిరంజీవి ఏపీ ప్రభుత్వ తీరును విమర్శించారు. విశాఖలో సినీరంగం అభివృద్ధి అంటూ మాటలు తప్ప చేతలు లేవని సూటిగా విమర్శలు చేసేశారు. దాంతో దాని సెగ చంద్రబాబుని తాకినట్టు తెలుస్తోంది. గంటా పర్యవేక్షణలో సాగిన సమావేశంలో చంద్రబాబు మీద విమర్శలు రావడం ఆయన సహించలేకపోతున్నట్టు చెబుతున్నారు. దాంతో గంటాకి మరోమారు గట్టిగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. అంతటితో సరిపెట్టకుండా ఎన్నిమార్లు చెప్పినా వ్యవహారం మార్చుకోని విద్యామంత్రికి ఇక ఊస్టింగ్ తప్పదన్నట్టుగా టీడీపీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. త్వరలో మంత్రివర్గంలో మార్పులు జరిగితే కాపు సామాజికవర్గం కోటాలో తూర్పు గోదావరి నుంచి తోట త్రిమూర్తులు లేదా జ్యోతుల నెహ్రూలలో ఒకరికి అవకాశం ఇచ్చి..విశాఖ నుంచి ఎంవీఎస్ మూర్తి, బండారు సత్యాన్నారాయణ మూర్తిలో ఒకరికి చోటు కల్పించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు . ఎటు చూసినప్టపికీ చంద్రబాబు గంటాను సాగనంపడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more